స్టంప్స్ వెనుక షాట్లు ఆడను.. కానీ బౌన్స్ తక్కువగా ఉండటంతో కొత్తగా ట్రై చేశా!!

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పంజాబ్ కింగ్స్‌పై ఘన విజయం దక్కింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ (141, 55 బంతుల్లో) వీరవిహారం చేసి, రికార్డుల సౌరభం సృష్టించాడు. లక్ష్య ఛేదనలో అత్యధిక పరుగులు (141) చేసిన బ్యాటర్‌గా మార్కస్ స్టాయినిస్ (124) రికార్డును అధిగమించాడు. ఈ సీజన్‌లో గత ఐదు మ్యాచుల్లో కేవలం 51 పరుగులతో నీరసించిన అభిషేక్, ఈసారి పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫలితంగా 246 పరుగుల భారీ లక్ష్యాన్ని హైదరాబాద్ 9 బంతులు మిగిలి ఉండగానే సాధించింది. అభిషేక్ వికెట్ల వెనుక ఆడిన అద్భుత షాట్లు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. “ఇంతకు ముందు ఇలాంటి షాట్లు ఆడలేదు,” అని అతనే స్వయంగా చెప్పడం విశేషం.

  • అభిషేక్ మాటల్లో: “ఫామ్‌ అందుకోవడం అంత సులువు కాదు. కెప్టెన్, టీమ్ మేనేజ్‌మెంట్ నా వెన్నంటే ఉన్నారు. ఫెయిల్ అయినప్పుడూ నన్ను సపోర్ట్ చేశారు. ఈ మ్యాచ్ నాకు, ట్రావిస్ హెడ్‌కు చాలా స్పెషల్. క్రీజులో ఇద్దరం మాట్లాడుకుంటూ ఆడాం. సాధారణంగా స్టంప్స్ వెనుక షాట్లు ఆడను, కానీ ఈసారి బౌండరీ సైజ్, పిచ్‌లో బౌన్స్ తక్కువగా ఉండటంతో కొత్తగా ట్రై చేశా. ఆరెంజ్ ఆర్మీ, నా తల్లిదండ్రులు స్టాండ్స్‌లో ఉన్నారు. ఇలాంటి సపోర్ట్ ఉండటం నా అదృష్టం. ఈ సెంచరీతో వరుస ఫెయిల్యూర్స్‌కు బ్రేక్ పడింది. యువరాజ్ సింగ్, సూర్యకుమార్ యాదవ్‌లకు స్పెషల్ థ్యాంక్స్, వాళ్లతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటా,” అని అభిషేక్ అన్నాడు.
https://www.instagram.com/reel/DIW2SYOvPvx/?utm_source=ig_web_copy_link
  • ట్రావిస్ హెడ్ రివీల్: అభిషేక్ సెంచరీ తర్వాత జేబులోంచి “ఇది ఆరెంజ్ ఆర్మీ కోసం” అని రాసిన కాగితం చూపించాడు. ఈ విషయంపై ట్రావిస్ హెడ్ మాట్లాడుతూ, “ఆ కాగితం గత ఐదు మ్యాచుల నుంచి అభిషేక్ దగ్గర ఉంది. ఆరో మ్యాచ్‌లో దాన్ని బయటపెట్టాడు,” అని చెప్పాడు.

శ్రేయస్ అయ్యర్ కామెంట్స్!!

పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ, “భారీ స్కోరు సెట్ చేసినా ఓటమి తప్పలేదు. 9 బంతులు మిగిలి ఉండగానే హైదరాబాద్ గెలిచింది, ఇప్పటికీ నవ్వొస్తోంది. కొన్ని క్యాచ్‌లు పట్టుంటే బాగుండేది. అభిషేక్‌కు లక్ కలిసొచ్చింది, అద్భుతంగా ఆడాడు. మా బౌలర్లు ప్లాన్‌ను అమలు చేయలేకపోయారు. ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనింగ్ భాగస్వామ్యం మ్యాచ్‌ను మా చేతుల్లోంచి తీసుకెళ్లింది. ఫెర్గూసన్ గాయం కూడా సెట్‌బ్యాక్. అయినా, ఇలాంటి ఓటముల నుంచి నేర్చుకుని ముందుకెళ్తాం. అభిషేక్ ఇన్నింగ్స్ నేను చూసిన బెస్ట్ ఇన్నింగ్స్‌లో ఒకటి,” అని అన్నాడు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *