ఏఐతో గుండె జబ్బులను గుర్తించే యాప్.. 14 ఏళ్ల సిద్ధార్థ్‌కు సీఎం చంద్రబాబు అభినందన

  • సిర్కాడియావీ యాప్ ద్వారా 7 సెకన్లలో గుండె జబ్బుల నిర్ధారణ
  • ఏఐలో మరిన్ని ఆవిష్కరణలు చేయాలని సీఎం ప్రోత్సాహం

ఏఐ సాయంతో గుండె జబ్బులను కేవలం 7 సెకన్లలో గుర్తించే ‘సిర్కాడియావీ’ యాప్‌ను అభివృద్ధి చేసిన 14 ఏళ్ల ఎన్నారై విద్యార్థి సిద్ధార్థ్ నంద్యాల, సోమవారం సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను రాష్ట్ర సచివాలయంలో కలిశారు. ఆయనకు అభినందనలు తెలిపిన చంద్రబాబు, వైద్యం రంగంలో మరిన్ని ఆవిష్కరణలు చేయాలని ప్రోత్సహించారు. “ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు అద్భుతాలు సృష్టించాలని నేను ఎప్పుడూ కలలు కంటా. సిద్ధార్థ్ లాంటి ప్రతిభావంతులు విజయాలు సాధించడం గర్వకారణం” అని సీఎం పేర్కొన్నారు. ఏఐ పరిశోధనలకు అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వం అందజేస్తుందని హామీ ఇచ్చారు.

సిర్కాడియావీ యాప్ ప్రత్యేకతలు

  • హార్ట్‌ బీట్‌ను విశ్లేషించి 7 సెకన్లలో గుండె సమస్యలు గుర్తించగలదు
  • గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ యాప్‌తో వైద్య పరీక్షలు నిర్వహించారు
  • సిద్ధార్థ్ ప్రస్తుతం టెక్సాస్ యూనివర్సిటీలో బ్యాచిలర్స్ చదువుతున్నాడు
  • ఏఐ-బేస్డ్ మెడికల్ టెక్నాలజీపై ప్రత్యేక పరిశోధనలు చేస్తున్నాడు

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *