- వైసీపీ నుంచి జనసేన వరకు రాజకీయ ప్రయాణం చేసిన పృథ్వీ
- సినిమా వేడుకల్లో కామెంట్స్ వల్ల ట్రోల్స్, ఎక్స్ ద్వారా తన అభిప్రాయాల వెల్లడి
ప్రముఖ కమెడీయన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ థర్టీ ఈయర్స్ పృథ్వీ తాజాగా సోషల్ మీడియాలో అడుగుపెట్టారు. గతంలో సినిమా వేడుకల వేదికగా రాజకీయాలపై కామెంట్స్ చేసి ట్రోలింగ్‌కు గురైన ఆయన, ఈసారి నేరుగా ఎక్స్ ఖాతా ఓపెన్ చేసి తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటానని ప్రకటించారు. ‘‘స్టేజ్‌పై మాట్లాడితే కొంతమంది ఫీలవుతున్నారు. అందుకే ఇకపై ఎక్స్ వేదికగా నా భావాలను తెలియజేస్తాను’’ అంటూ ఆయన శనివారం ట్వీట్ చేశారు.
సెటైర్లు, ట్రోలింగ్ మళ్లీ మొదలే!
ఇటీవల ‘లైలా’ సినిమా వేడుకలో ఆయన చేసిన కామెంట్లు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దాంతో కొందరు ఆయనపై ట్రోలింగ్‌కు దిగారు. ఇప్పుడు ఎక్స్‌లో అడుగుపెట్టిన ఆయన, ‘‘రోజుకు 11సార్లు నీళ్లు తాగండి. 151 డిగ్రీలకు హీట్ టచ్ అవ్వొచ్చు’’ అంటూ మరో సెటైర్ వేశారు. ఈ వ్యాఖ్యలు ప్రత్యర్థి పార్టీకి వ్యతిరేకంగా చేసినట్లే అనిపిస్తోంది. తాను ఎక్స్‌లో ఏం చెప్పబోతున్నాడో, రాజకీయ సెటైర్లు ఏ రేంజ్‌లో సాగబోతున్నాయో అన్న ఆసక్తి పెరుగుతోంది.





