బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ: నాలుగో టెస్టుకు భారత్‌లో మార్పు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో భారత్ ఒక కీలక మార్పుతో బరిలోకి దిగింది. మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో, టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండటంతో, భారత జట్టులో శుభ్‌మన్ గిల్‌ను తప్పించి వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకున్నారు. గత రెండు మ్యాచుల్లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హిట్‌మ్యాన్ ఈ మ్యాచ్‌లో వన్ డౌన్‌లో బ్యాటింగ్‌కు రానున్నాడు. మరోవైపు, ఆస్ట్రేలియా జట్టులో 19 ఏళ్ల ఓపెనర్ సామ్ కొంటాస్‌ను చేర్చగా, గాయపడిన జోష్ హేజిల్‌వుడ్ స్థానంలో స్కాట్ బొలాండ్‌ను ఎంపిక చేసింది.మెల్‌బోర్న్ వేదికలో భారత్‌కు మంచి రికార్డు ఉండగా, 2014 నుంచి ఇక్కడ ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. గత మూడు మ్యాచుల్లో రెండింటిని గెలుచుకున్న భారత్, ఈసారి కూడా అదే విజయాన్ని సాధించాలని భావిస్తోంది. అయితే, వర్షం కారణంగా మూడో టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే, నాలుగో టెస్టుకు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. అయితే, 3-4 రోజుల్లో కాస్తంత అంతరాయం కలిగించే అవకాశం ఉన్నప్పటికీ, భారీ వర్ష సూచనలు లేవని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టెస్టు సిరీస్ 1-1తో సమమైంది.

భారత తుది జట్టు:
యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీందర్ జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్

ఆస్ట్రేలియా తుది జట్టు:
ఉస్మాన్ ఖవాజా, సామ్ కొన్‍‌టాస్, మార్నస్ లబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లైయాన్, స్కాట్ బొలాండ్

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *