5201314: గూగుల్‌లో మనోళ్లు ఎక్కువగా వెతికిన సంఖ్య ఇదే! దీని అర్థం ఏమిటి?

The number sequence 5201314 written on a computer screen or chat message
  • 2025లో భారతీయులు గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన ప్రత్యేక సంఖ్యల క్రమం 5201314
  • ఈ సంఖ్య ఒక ప్రేమ సందేశం.. మాండరిన్ భాషలోని పదాల శబ్దంతో దీని అర్థాన్ని చెబుతారు

2025 సంవత్సరానికి గాను గూగుల్ విడుదల చేసిన ‘వార్షిక సెర్చ్ రిపోర్ట్’లో ఒక ఆసక్తికరమైన అంశం చోటు దక్కించుకుంది. అదే 5201314 అనే ప్రత్యేక సంఖ్యల క్రమం. ఇది ‘మేడే’, ‘స్టాంపీడ్’ వంటి పదాలతో పాటు టాప్ ట్రెండింగ్ సెర్చ్‌ల జాబితాలో ఈ నెంబర్ ఉంది. ఈ సంఖ్యలు పైకి చూసినంత రాండమ్‌గా ఉండవు. నిజానికి, ఇది డిజిటల్ కమ్యూనికేషన్‌లో ఉపయోగించే ఒక ప్రేమ సందేశం.

ఈ సంఖ్యల అర్థం మాండరిన్ భాషతో ముడిపడి ఉంది. మాండరిన్‌లో ఉన్న పదాల శబ్దాలు ఈ సంఖ్యలకు దగ్గరగా ఉండడం వల్ల దీని అర్థం రూపుదిద్దుకుంది:

  • 520 అనే సంఖ్య మాండరిన్‌లోని wǒ ài nǐ (ఐ లవ్ యూ)
  • 1314 అనేది yī shēng yī shì (ఫర్ ఏ లైఫ్‌టైమ్) అనే భావన!

కలిపి చూస్తే 5201314 అంటే — “నిన్ను జీవితాంతం ప్రేమించాను/ప్రేమిస్తూనే ఉంటాను” అని అర్థం వస్తుంది.

సోషల్ మీడియా ట్రెండ్

సోషల్ మీడియా ప్రభావం పెరిగినకొద్దీ డిజిటల్ స్లాంగ్‌లు కూడా విపరీతంగా పెరిగాయి. ఇన్‌స్టాగ్రామ్, షార్ట్ వీడియో యాప్స్, మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఇవన్నీ యువతను ఇలాంటి కోడ్‌లను, సంఖ్యల ప్రేమ సందేశాలను వాడేలా చేశాయి. ఈ ట్రెండ్ చైనా, కొరియా వంటి దేశాల్లో చాలా కాలం నుంచే ఉంది. ఇప్పుడు భారతీయులు కూడా ఈ కొత్త స్లాంగ్‌లను ఉపయోగించడం మొదలుపెట్టారు.

5201314 అనే సంఖ్య మొదట చైనీస్ సోషల్ మీడియాలో పాపులర్ అయింది. క్యాప్షన్‌లు, రీల్స్‌, ప్రైవేట్ మెసేజ్‌లలో ఇది విపరీతంగా వాడారు. అందరి ఫీడ్‌లో ఈ సంఖ్య కనిపించడంతో, దీని అర్థం ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. చివరికి గూగుల్‌లో దీనిని సెర్చ్ చేసే వారి సంఖ్య భారీగా పెరిగి, అత్యధికంగా వెతికిన టర్మ్‌లలో ఒకటిగా మారింది. భారతీయులకు ఇది కొత్తేమీ కాదు. మన దగ్గర కూడా 143 అన్న సంఖ్యను “I Love You” అనే అర్థంతో చాలా కాలంగా వాడుతున్నారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
Breaking News
కేటగిరి

మా న్యూస్ అప్డేట్లు కోసం సబ్‌స్క్రైబ్ చేయండి!

Everyday we discover real news for you.