
టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ నటి సమంత సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్న సమంత, “హ్యాపీ బర్త్‌డే డియర్ రానా. మీ ప్రతీ పనిలోనూ 100 శాతం శ్రమిస్తారు. ఆ శ్రమించడం నాకెంతో స్ఫూర్తినిచ్చింది” అని పేర్కొన్నారు. అలాగే రానాను తనకు అభిమాన హీరోగా అభివర్ణిస్తూ, దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఆయనతో ఉండాలని కోరుకున్నారు. ఆమె రానాతో ఉన్న స్నేహాన్ని కూడా పలు సందర్భాల్లో ప్రస్తావించారు. ఇద్దరూ కలిసి ‘బెంగళూరు డేస్’ తమిళ రీమేక్‌లో నటించినప్పటి నుంచి వీరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఇటీవల జరిగిన ఐఫా అవార్డుల కార్యక్రమంలో రానా, సమంతను “మై సిస్టర్” అని సంభోదించిన విషయం ప్రస్తావనీయమే. సమంత ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్’ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌ను ‘తుంబాడ్’ ఫేమ్ రాహి అనిల్ బార్వే దర్శకత్వం వహిస్తున్నారు.






