ఎయిర్ ట్యాగ్ 2.0:యాపిల్ బుల్లి ట్యాగ్ మారుతోందా?

యాపిల్ ఉత్పత్తి ఏదైనా సరే.. మార్కెట్ లోకి వచ్చిందంటే ఆ సందడే వేరు. ఎందుకంటే వాటిపై ఉన్న మోజు అలాంటిది. ప్రతి ఉత్పత్తిలోనూ తమదైన ముద్ర వేసేలా యాపిల్ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ క్రమంలో  ఎప్పుడో బుల్లి ట్రాకింగ్ డివైజ్ ‘ఎయిర్ ట్యాగ్’ ని రిలీట్ చేసిన యాపిల్ ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘ఎయిర్ ట్యగ్ 2’ ని లాంచ్ చేసేందుకు సిద్ధం అవుతోంది.  రెండో తరం ఎయిర్ ట్యాగ్ గా దీన్ని యాపిల్ అబివర్ణిస్తోంది.  ఫోన్, పర్సు లేదా ఇంకేమైనా విలువైన వస్తువుల్ని పోగొట్టుకోకుండా ఈ బుల్లి ట్రాకింగ్ ట్యాగ్ ని వాడొచ్చు.  ఈ కొత్త డివైస్‌లో యాపిల్ రెండవ తరం Ultra-Wideband (UWB) చిప్ ఉపయోగించనుంది. ఇది ప్రస్తుత AirTag కంటే మూడు రెట్లు ఎక్కువ ట్రాకింగ్ రేంజ్‌ను అందించనుంది.  దీంతో  ట్రాకింగ్ సామర్థ్యంతో పాటు మరిన్ని సురక్షితత ఫీచర్లను ట్యాగ్ అందించనుంది. దీని ద్వారా ట్రాకింగ్ దూరం సుమారు 60 మీటర్లు (సుమారు  200 అడుగులు) వరకు పెరుగుతుంది. దీంతో విలువైన వస్తువులపై నిఘాని మరింత కట్టుదిట్టంగా ప్లాన్  చేసుకోవచ్చు.  అదనంగా, AirTag 2లో రీడిజైన్  చేసిన బిల్ట్-ఇన్ స్పీకర్ ఉండొచ్చని టెక్నాలజీ విశ్లేషకుల అంచనా. దీంతో వాడకం మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉండొచ్చు.  సురక్షితత ఫీచర్లను మినహా లుక్  & ఫీల్‌ పాత ఎయిర్ ట్యాగ్ మాదిరే అనిపిస్తుందట.  ఈ డివైస్‌కు B589 అనే కోడ్‌నేమ్ పెట్టారని, దీన్ని కొత్త స్మార్ట్ హోమ్ డిస్‌ప్లే తో కలిసి లాంచ్ చేయనున్నట్లు సమాచారం. 2021లో AirTag లాంచ్ అయినప్పటి నుండి కొన్ని ప్రైవసీ సమస్యలు లేవనెత్తడంతో విమర్శలు ఎదుర్కొన్నది. కొత్త AirTag 2 ఇవేం లేకుండా ఉండాలనే లక్ష్యంతో యాపిల్ ఎయిర్ ట్యాగ్ 2 ని సిద్ధం చేస్తోంది. 

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
Breaking News
కేటగిరి

మా న్యూస్ అప్డేట్లు కోసం సబ్‌స్క్రైబ్ చేయండి!

Everyday we discover real news for you.