వాట్సాప్ లో గోప్యతకు మరో కొత్త హంగు: ‘వ్యూ వన్స్’ తో వాయిస్ మెసేజ్ లు ఒక్కసారే!!

ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను జత చేస్తూ వాట్సాప్ తమ వినియోగదారులకు మరింత దగ్గరవుతోంది. ఈ క్రమంలో ఇటీవలే “View Once” ఫీచర్‌ను ఫోటోలు, వీడియోలు కోసం అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో వాయిస్ మెసేజ్‌లపై కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ఉపయోగించడం ద్వారా సెన్సిటివ్ సమాచారం అందించేటప్పుడు అదనపు గోప్యత పొందవచ్చు. ఈ వ్యూ వన్స్ వాయిస్ మెసేజ్ ఎలా పంపాలంటే..  మీ WhatsApp చాట్ ఓపెన్ చేయండి. తర్వాత టెక్స్ట్ బాక్స్ పక్కన ఉన్న మైక్రోఫోన్ బటన్‌ను ప్రెస్ చేసి హోల్డ్ చేయండి. పైకి స్లయిడ్ చేసి లాక్‌ చేయండి. రికార్డ్ అయిన తరువాత “View Once” ఐకాన్ (సర్కిల్‌లో ‘1’ గుర్తు) పై ట్యాప్ చేయండి. చివరగా సెండ్ బటన్ పై క్లిక్ చేయండి.  “View Once” వాయిస్ మెసేజ్‌లు గోప్యతా ను కాపాడేందుకే కాదు. క్రెడిట్ కార్డ్ వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని చెప్పేటప్పుడు కూడా ఈ ‘వ్యూ వన్స్’ ఫీచర్ ని వాడొచ్చు. అంటే.. అత్యంత సన్నిహితులకు ఏదైనా ఏమైన ముఖ్యమైన సమాచారాన్ని వాయిస్ రూపంలో పంపాల్సి వస్తే ఇలా ‘వ్యూ వన్స్’ ఆప్షన్ ని ఎనేబుల్ చేసి పంపొచ్చు.  ఈ ఫీచర్ ని ఎనేబుల్ చేస్తే.. ఆడియోని ఒక్కసారి మాత్రమే మాత్రమే వినగలుగుతారు. తర్వాత అది ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతుంది. పైగా, WhatsApp ఈ మెసేజ్‌లను ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా భద్రత కల్పిస్తోంది. దీంతో డేటాని ఇతరులు పొందడం అనేది అసాధ్యం. 

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *