గత కొన్నాళ్లుగా రూట్ మార్చిన అల్లరి నరేశ్, సీరియస్ కాన్సెప్ట్ సినిమాలు చేస్తూ ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. ఇతడి లేటెస్ట్ మూవీ ‘బచ్చల మల్లి’ ఈ వారం థియేటర్లలో రిలీజైంది. సుబ్బ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. గురువారం రాత్రి ప్రీమియర్స్ వేశారు, దీంతో మూవీ టాక్ బయటకొచ్చింది.
సినిమా కథ
‘బచ్చల మల్లి’ సినిమా ట్రాక్టర్ డ్రైవర్ జీవితాన్ని స్పూర్తిగా తీసుకుని రూపొందించబడింది. అల్లరి నరేశ్ పక్కన ‘హనుమాన్’ ఫేమ్ అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించింది.
టాక్ మరియు సమీక్షలు
టాక్ విషయానికొస్తే, “మూర్ఖత్వంతో తీసుకునే నిర్ణయాల వల్ల జీవితం ఎలా నాశనం అవుతుందో” అనే విషయాన్ని చక్కటి ఉదాహరణగా ‘బచ్చల మల్లి’ సినిమా. ఈ మల్లిగాడు గుర్తుండిపోతాడని కూడా చెబుతున్నారు.
- హైలైట్స్:
- డైలాగ్స్
- జాతర ఫైట్ సీన్
- చివరి 20 నిమిషాలు
- హీరో క్యారెక్టరైజేషన్
కానీ, స్క్రీన్ ప్లే విషయంలో మరికాస్త కేర్ తీసుకోవాల్సిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఓవరాల్‌గా చూసేటప్పుడు డెప్త్ తగ్గినట్లు అనిపించిందని ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.






