చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024: అవార్డుల విజేతలుతమిళ చిత్ర పరిశ్రమ ప్రత్యేకంగా భావించే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గురువారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కోలీవుడ్ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సందడి చేశారు.
అవార్డుల విజేతలు
- ఉత్తమ చిత్రం: అమరన్
- రెండో ఉత్తమ చిత్రం: లబ్బర్ పందు
- ఉత్తమ నటుడు: విజయ్ సేతుపతి (మహారాజ్)
- ఉత్తమ నటి: సాయిపల్లవి (అమరన్)
- ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సీహెచ్ సాయి (అమరన్)
- ఉత్తమ ఎడిటర్: ఫిలోమిన్ రాజ్ (అమరన్)
- ఉత్తమ బాలనటుడు: పొన్వెల్ (వాళై)
- ఉత్తమ సహాయనటుడు: దినేశ్ (లబ్బర్ పందు)
- ఉత్తమ సహాయనటి: దుషారా విజయన్ (వేట్టయన్)
- ఉత్తమ రచయిత: నిథిలన్ సామినాథన్ (మహారాజ్)
- ఉత్తమ సంగీత దర్శకుడు: జీవీ ప్రకాశ్ (అమరన్)
- స్పెషల్ జ్యూరీ అవార్డు: మారి సెల్వరాజ్ (వాళై), పా.రంజిత్ (తంగలాన్)
సాయిపల్లవి ,విజయ్ సేతుపతి ఏమన్నారంటే?
సాయిపల్లవి, అమరన్ చిత్రానికి ఉత్తమ నటిగా అవార్డు అందుకోవడం పై ఆనందం వ్యక్తం చేశారు. “ఈ ఏడాది ఎన్నో గొప్ప చిత్రాలు విడుదలయ్యాయి. ఎంతో పోటీ నెలకొంది. అలాంటి సమయంలో ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేయడం ఆనందంగా ఉంది” అని ఆమె అన్నారు.విజయ్ సేతుపతి కూడా తన అవార్డు గురించి మాట్లాడుతూ, “‘మహారాజ’ను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు” అని తెలిపారు..






