విడాకులు తీసుకున్నా పుష్పా!! పదా పార్టీ చేసుకుందాం! ఇప్పుడు ప్రతీదీ సెలబ్రేషనే!!

సంప్రదాయాల్ని బ్రేక్ చేస్తూ.. ఆధునికత వైపు మారుతున్న సమాజంలో ప్రతీదీ సెలబ్రేషనే. అందులో విడాకులు కూడా వచ్చి చేరాయి. ఎందుకంటే నేటి తరంలో విడాకులపై ఉన్న దృక్పథం వేగంగా మారుతోంది. పెళ్లి వంటి శుభకార్యాన్ని ఘనంగా జరుపుకుంటున్నామో.. విడాకులను కూడా ఓ కొత్త ప్రారంభంగా భావిస్తూ వేడుకలు నిర్వహించడం అనేక నగరాల్లో కొత్త ట్రెండ్‌గా మారింది. ఝార్ఖండ్‌లో ఓ తండ్రి తన విడాకులు పొందిన కూతురిని బ్యాండ్‌ మేళాలతో ఇంటికి ఆహ్వానించి, బంధుమిత్రులకు ఘన విందు ఏర్పాటు చేయడం.. అంతేనా.. హరియాణాలో ఓ వ్యక్తి తన భార్యతో విడిపోయిన తర్వాత ఆమె ప్రతిరూపాన్ని బొమ్మ రూపంలో తయారు చేయించి స్నేహితులతో గ్రాండ్‌ పార్టీ చేయడం ఈ మారుతున్న సమాజాన్ని ప్రతిబింబిస్తున్న సంఘటనలుగా నిలిచాయి.

విడాకులను బాధగా కాదు, జీవితంలో కొత్త ఆరంభం అని భావించడమే ఈ ట్రెండ్‌ వెనుక ఉన్న ఆలోచన. ప్రత్యేకంగా ‘డైవోర్స్‌ పార్టీలు’ ఏర్పాటు చేసి, పాత సంబంధాల నుంచి బయటపడి కొత్తగా జీవితాన్ని ప్రారంభించేందుకు నడుం బిగిస్తున్నారు. ముఖ్యంగా యువతలో ఈ సంస్కృతి వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. మనసు కలవకపోవడం, సంబంధం సజావుగా సాగకపోవడం వంటి కారణాలతో విడిపోయే జంటలు, విడాకులను జీవితంలోని మరో దశగా చూస్తున్నారు. కొత్త ఆరంభాన్ని వేడుకగా జరుపుకుంటూ మానసిక ఒత్తిడిని దూరం చేయాలన్న ఉద్దేశంతో ఈ తరహా వేడుకలు నిర్వహిస్తున్నారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *