రేవతి మరణం విషయాన్ని అల్లు అర్జున్‌కి థియేటర్తె లోనే చెప్పాను: ఏసీపీ రమేశ్‌కుమార్‌

సంధ్య ధియేటర్ లో జరిగిన దుర్ఘటనలో మహిళ రేవతి మృతి చెందడం, శ్రీతేజ్‌ అనే బాలుడు అపస్మారక స్థితిలో ఉండడంపై నటి అల్లు అర్జున్‌కు సమాచారం ఇచ్చిన ఘటనలో ఏసీపీ రమేశ్‌కుమార్‌ కీలక విషయాలు వెల్లడించారు. ‘‘రేవతి మరణం, బాలుడి పరిస్థితి గురించి అల్లు అర్జున్‌ మేనేజర్‌ సంతోష్‌కు వివరించాను. అర్జున్‌గారికి చెప్పాలని సూచించాను. అయితే, ఆ విషయాన్ని తానే చెప్పుతానని సంతోష్‌ చెప్పారు. చాలా సేపు స్పందన రాకపోవడంతో డీసీపీ ఆదేశంతో నేరుగా అర్జున్‌ వద్దకు వెళ్లాను. మహిళ మృతి చెందిందని, బాలుడు అపస్మారక స్థితిలో ఉన్నాడని వివరించాను. అయితే అర్జున్‌ సినిమా పూర్తయ్యాకే వస్తానని చెప్పారు. ఈ విషయాన్ని డీసీపీకి తెలిపాను. ఆ తర్వాత డీసీపీ, నేను కలిసి వెళ్లి అర్జున్‌గారిని బయటకు తీసుకొచ్చాం,’’ అని ఏసీపీ రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *