
తలపై కుచ్చు దువ్వినట్లు కనువిందు చేస్తూ, రివ్వున ఎగురుతూ కొల్లేరును చుట్టేసి పర్యాటకులను ఆకట్టుకుంటుంది. స్థానికులు దీనిని భరద్వాజ పక్షి (Oriental Skylark) అని పిలుస్తారు.ఈ పక్షి 16 సెం.మీ. పొడవు మరియు 24 నుంచి 30 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. రెక్కల భాగాలు పసుపు గోధుమ రంగులో ఉంటాయి, తోక కింది భాగం తెల్లగా ఉంటుంది.
చిత్తడి నేలలు, మంచినీటి సరస్సులు, పొలాలు వంటి విశాల ప్రదేశాల్లో విహరించడం ఇష్టపడుతుంది.ఓరియంటల్ స్కైలార్క్ రెండు గుడ్లు పెట్టి, 18 రోజులు పొదిగి సంతానోత్పత్తి చేస్తుంది. మనదేశంతో పాటు దక్షిణ, తూర్పు చైనా తీరం, బంగ్లాదేశ్, వియత్నాం, మలేసియా, కంబోడియా మరియు పాకిస్థాన్ దేశాల్లో ఈ పక్షులు అధికంగా కనిపిస్తాయి.చిరు ధాన్యాలు, పురుగులు మరియు కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. కొల్లేరులో ఈ జాతి పక్షులు 5 వేల వరకు ఉంటాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు!





