మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రంలో కియారా అద్వాణీ కథానాయికగా నటించారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ భారీగా నిర్మించారు. ఈ క్రమంలో ఆదివారం విజయవాడలో ఆర్‌సీ యువశక్తి ఆధ్వర్యంలో 256 అడుగుల ఎత్తైన రామ్ చరణ్ భారీ కటౌట్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

చిరంజీవి మాటలు ఫ్యాన్స్‌కి ఉత్సాహం
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ, ‘‘చిరంజీవి గారు ఈ సినిమాను పూర్తిగా చూశారు. ఆయన చెప్పిన ఒక్కో మాటలో సినిమా బలం తెలుస్తోంది. సంక్రాంతికి మెగా పవర్ స్టార్ తన నట విశ్వరూపంతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఐఏఎస్ అధికారి, పోలీస్ ఆఫీసర్, రాజకీయ నాయకుడిగా రామ్ చరణ్ మూడు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నారు. శంకర్ మార్క్ తో ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది’’ అన్నారు.
ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ వివరాలు
దిల్ రాజు తెలిపిన వివరాల ప్రకారం, జనవరి 1న ట్రైలర్ విడుదల కానుంది. అలాగే జనవరి 4 లేదా 5న పవన్ కళ్యాణ్ హాజరయ్యే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏపీలో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ‘‘సంక్రాంతి పండుగను మెగా ఫ్యాన్స్ మరింత ఘనంగా జరుపుకునేందుకు ‘గేమ్ చేంజర్’ సిద్ధమైంది,’’ అన్నారు.





