సందర్భం ఏదైనా కొంతమంది జీన్స్‌లోనే సౌకర్యంగా ఫీలవుతారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత వదులుగా ఉండే నైట్‌వేర్ ధరించడం అనుకూలంగా ఉంటుంది. అయితే అనుకోకుండా స్నేహితుల ఇంట్లో ఉండాల్సివచ్చినా, ప్రయాణాల్లోనూ అదే జీన్స్‌లో నిద్రపోవడం వల్ల ఆరోగ్యపరంగా సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్లు, నిద్రకు అంతరాయం, నెలసరి నొప్పి వంటి ప్రభావాలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు.
ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం
డెనిమ్ ఫ్యాబ్రిక్ చెమటను పీల్చుకోదు. స్కిన్ టైట్ జీన్స్ ధరిస్తే చెమట అలాగే ఉండిపోతుంది. ఇది తేమతో కలిసి ఫంగల్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. బిగుతైన దుస్తుల వల్ల చర్మంపై దురద, దద్దుర్లు వస్తాయి. ముఖ్యంగా చెమట ఎక్కువగా వచ్చే వారు జీన్స్ ధరించే సమయాన్ని తగ్గించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
నిద్రకు అంతరాయం
జీన్స్‌లో నిద్రపోతే శరీర ఉష్ణోగ్రత పెరిగి నిద్రకు అంతరాయం కలుగుతుంది. బిగుతైన దుస్తుల వల్ల శరీరం అసౌకర్యంగా ఉండడం కూడా సుఖనిద్రను దూరం చేస్తుంది.
నెలసరి నొప్పి తీవ్రత
బిగుతైన దుస్తుల వల్ల గర్భాశయంపై ఒత్తిడి పెరుగుతుంది. రక్తప్రసరణ సాఫీగా జరగకపోవడంతో నెలసరి నొప్పి తీవ్రత ఎక్కువవుతుంది. నడుంనొప్పి, కడుపుబ్బరం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. కాబట్టి జీన్స్‌కు బదులుగా వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.





