చంద్రబాబు నాయుడు (Chandrababu) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 931 కోట్ల ఆస్తులతో దేశంలోనే ధనిక సీఎంగా నిలిచారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం, ఆస్థితో పాటు ఆయన కుటుంబం అప్పులు 10 కోట్ల రూపాయలుగా ఉన్నాయని వెల్లడైంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రూ.15 లక్షల ఆస్తులతో చివరి స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ (332 కోట్లు) రెండో స్థానంలో, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (51 కోట్లు) మూడో స్థానంలో ఉన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 30 కోట్ల ఆస్తులతో 7వ స్థానంలో ఉన్నారు. దేశంలో 31 మంది ముఖ్యమంత్రుల సరాసరి ఆస్తి విలువ రూ.52.59 కోట్లుగా ఉంది, ఇందులో 13 మంది ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ADR పేర్కొంది.






