కొత్త ఏడాదికి అన్నీ నీట్ గా పెట్టుకుని.. పద్ధతిగా లైఫ్ ని లీడ్ చేయాలా? ఇవిగోండి గ్యాడ్జెట్ లు!!

ఆఫీస్ పనులు.. ఇంట్లో అవసరాలు.. బయట చక్కబెట్టేవి… ఇలా దేనికైనా ఫోనో, ల్యాప్ టాప్ నో అందుకోవాల్సిందే. ఇంకా చెప్పాలంటే… రోజులో ఎక్కువ సమయం గ్యాడ్జెట్ ల ముందే గడిపేస్తున్నాం. అలాంటప్పుడు వాటి శుభ్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు? వాటిని ఎప్పుడైనా క్లీన్ చేస్తున్నారా? ఇదిగోండి.. Portronics Clean M Multifunctional 8-in-1 క్లినింగ్ కిట్ ని ప్రయత్నించండి.  ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్ టాప్, ఇయర్ బడ్స్.. ఇలా అన్నింటిని చక్కగా శుభ్రం చేసుకోవచ్చు. చూడ్డానికి ఇదో చిన్న బాక్స్ లా కనిపిస్తుందేగానీ.. దీంట్లో అన్నీ ఉన్నాయి. కీబోర్డుల్లో కీస్ ని క్లీన్ చేసేందుకు కాస్త పొడవైన బ్రష్ ఒకటి… అలాగే, ఇయర్ బడ్స్ లాంటి చిన్న గ్యాడ్జెట్ రంధ్రాల్లోని దుమ్ము తొలగించేందుకు చిన్న బ్రష్ లు ప్రత్యకంగా ఉన్నాయి. అంతేకాదు.. క్లీనింగ్ లిక్విడ్ ని స్ప్రే చేసేందుకు ఓ బటన్ కూడా ఉంది.  హెడ్ ఫోన్స్ ని శుభ్రం చేసేందుకు అనువైన సరంరజామా ఉంది.  కీబోర్డ్ లను క్లీన్ చేసేటప్పుడు అవసరం మేరకు ప్రత్యేక ‘కీపుల్లర్’ ద్వారా మీటల్ని బటయకి లాగొచ్చు. లోపల చేరుకున్న చెత్తని తొలగించాక తిరిగి బటన్స్ పెట్టేయొచ్చు. బాక్స్ పైన అంటుకుని ఉన్న ఫైబర్ క్లాత్ తో గ్యాడ్జెట్ తెరల్ని సుతారంగా శుభ్రం చేయొచ్చు. ఫైనల్ గా దీన్ని మొబైల్ హోల్డర్ లా కూడా వాడుకోవచ్చు. 
ధర: రూ.349
దొరుకుచోటు:  https://tinyurl.com/3ms2e2vj

గ్యాడ్జెట్ లకు ఒక బ్యాగు!
ఏదైనా ఊరు ప్రయాణం చేస్తున్నాం అంటే.. దుస్తులకు ఓ బ్యాగు, మెకప్ సామాగ్రికి ఒక బ్యాగు, తినుబండాలకు ఓ బ్యాగు.. ఇలా వేటికవే సర్దుకోవడం అలవాటే. కానీ, కొన్ని సార్లు ఈ ఛార్జర్లు, ఇయర్ ఫోన్స్, పవర బ్యాంకు, యూఎస్ బీ కేబుళ్లను దేంట్లో పెట్టాలా? అని ఆలోచిస్తాం. అందుకే ఇదిగో ఈ బుజ్జి బ్యాగు. దీని పేరు Marshal Tech Kit. దీంట్లో ఉన్న అరల్లో దేనికదే చక్కగా సెట్ అవుతాయి. రెండు సైజుల్లో ఈ బ్యాగుల్ని డిజైన్ చేశారు.  పెద్ద సైజు బ్యాగులో స్టైలస్ ని పెట్టుకునేందుకు ప్రత్యేక హోల్డర్ ఉంది. అంతేకాదు.. హార్డ్ డ్రైవ్ ల్ని భద్రంగా పెట్టుకునేందుకు ఓ అర ఉంది. అలాగే, పవర్ బ్యాంక్ కి ఓ అర, వైర్ లెస్ మౌస్ ని పెట్టుకునేందుకు మరోటి ఉన్నాయి. దీంట్లో మెమొరీ కార్డుల్ని కూడా సేఫ్ గా దాచుకోవచ్చు. 
ధర: రూ.873
దొరుకు చోటు: https://tinyurl.com/fmsy47ez

ల్యాపీకి వేడి నుంచి ఉపశమనం!
రోజుకి ఎన్ని గంటలు మీ ల్యాప్ టాప్ పై పని చేస్తున్నారు? అని ఎవరినైనా అడిగి చూడండి. ఒకసారి కళ్లు పైకెత్తి.. సుమారు 10 నుంచి 12 గంటలు అని చెప్పక తప్పుదు.  ఇంకొంత మంది.. ఇంకా ఎక్కువ టైమ్ ఉంటారు. అలాంటప్పుడు బుర్ర హీటెక్కుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. మరి, మీ ల్యాపీ సంగతేంటి? పొగలు కక్కుతూ పని చేయాల్సిందేనా? ఏం అక్కర్లేదు.. ఇదిగో ఈ Florican Portable Invisible Laptop Riser స్టాండ్ ని వాడొచ్చు.  దీన్ని ల్యాప్ కి రెండు వైపులా క్లిప్పుల్లా పెట్టి వాడుకోవచ్చు. వర్క్ చేసేటప్పుడు స్టాండ్ మాదిరిగా ల్యాపీని పైకి లేపుతుంది. ప్రత్యేకంగా స్టాండ్ ని తీసుకెళ్లే పని లేకుడా.. ఈ పోర్టబుల్ రైజర్ స్టాండ్ ల్యాపీలో భాగంగా కలిసిపోతుంది.  స్టాండ్ మోడ్ లో పెట్టినప్పుడు జరగకుండా రెండు క్లిప్స్ లాక్ అవుతాయి. దీంతో ల్యాప్ టాప్ ఫ్లెక్సిబుల్ గా టేబుల్ పై కూర్చుంటుంది.  10 నుంచి 17 అంగుళాల ల్యాప్ టాప్ ల్లో ఈ స్టాండ్ ని వినియోగించొచ్చు.  ఎక్కడికైనా మనతో పాటే 
ధర: రూ.238
దొరుకు చోటు: https://tinyurl.com/nb67kedj

వ్లాగింగ్ చేస్తున్నారా? అయితే మీ కోసమే
వంటలు మొదలు ప్రపంచ పర్యాటకం వరకూ.. ఎవరైనా, దేని గురించి అయినా కంటెంట్ చేస్తున్నారు. పాడ్ క్యాస్ట్ లు ప్లాన్ చేస్తున్నారు. వీడియో వాగ్ల్స్ చేస్తున్నారు? మీరు కూడా అదే కోవ లోకి వస్తే.. ఈ వ్లాగింగ్ కిట్ ని ఒకసారి చూసేయండి.  దీంతో చాలా సులభంగా వీడియోలు చేయొచ్చు. అందుకు అనువుగా ఓ మైక్రోఫోన్, లైట్, ట్రైపాడ్, ఫోన్ క్లిప్ ఉన్నాయి.  జెస్ట్..  దీన్ని టేబుల్ పైన అమర్చుకుని వ్లాగ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలు చేసేయొచ్చు.  స్టాండ్ పై భాగంలో మైక్రోఫోన్ ఉంటుంది. దీన్ని 3.5 కేబుల్ తో ఫోన్ కి కనెక్ట్ చేయొచ్చు. దీంతో వాయిస్ క్యాన్సిలేషన్ తో వాయిస్ రికార్డ్ అవుతుంది.  వెలుతురు కోసం ఎల్ ఈ డీ లైట్ ని ఆన్ చేసుకోవచ్చు. మీరు ఫోన్ తో వీడియో తీస్తున్నట్లయితే ‘ఫోన్ క్లాంప్’కి ఫోన్ అమర్చుకోవచ్చు. ఒకవేళ డీఎల్ ఎస్ ఆర్ కెమెరా ని వాడుతున్నట్లయితే ‘ట్రైపాడ్’పై అమర్చుకునే వీలుంది. వైర్ లెస్ రిమోట్ కంట్రోల్ తో ఫోన్ కెమెరాని ఆపరేట్ చేయొచ్చు.  ట్రైపాడ్ ని 7 రకాలుగా మార్పులు చేసుకునే వీలుంది. 
ధర: రూ.569
దొరుకు చోటు:   

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *