కారు, బైక్ లేదా సైకిల్ లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు ఆలోచించేది టైర్లలో గాలి సరిపడా ఉందా? లేదా? అనే. అనుకోకుండా టైర్లలో గాలి కాస్త తగ్గితే.. లైదా పంక్చర్ అయితే..? ఏం కంగారు పడకుండా ఇదిగో ఈ వైర్ లెస్ డివైజ్ తో గాలి నింపేయొచ్చు. పవర్ బ్యాంకు పరిమాణంలో కనిపించే దీని పేరు ‘వాయు 3.0’. పొట్రానిక్స్ కంపెనీ దీన్ని రూపొందించింది. కారు, బైక్, సైకిల్.. టైర్ ఏదైనా గాలి ఎంతుందో చెక్ చేయొచ్చు. డిస్ ప్లేలో రీడింగ్ కనిపిస్తుంది. తక్కువైతే క్షణాల్లో గాలిని నింపేస్తుంది. ఎంతలా అంటే.. కారు టైర్ లో 1.5 నిమిషాల్లో గాలిని నింపేయొచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్. ఒక్క సారి ఛార్జ్ చేస్తే 4 నుంచి 5 సార్లు టైర్లలో గాలిని నింపుతుంది. ఈ వాయు 3.0 పరికరంలో ఎల్ఈ డీ ఫ్లాష్ లైట్ కూడా ఉంది. రాత్రి సమయాల్లో కారు పంక్చర్ అయితే ఈ లైట్ అన్ చేసుకుని లైర్ మార్చొచ్చు. గాలి చెక్ చేసేటప్పుడు కూడా లైట్ ని వాడొచ్చు. ధర: రూ.2,099
దొరుకు చోటు: https://l1nq.com/byCmO





