
చిత్రంగా అనిపింస్తోంది కదూ! కాలేజీ క్యాంపస్‌ల్లోనూ… క్లాస్ రూం బెంచీపైనా… కాఫ్టేరియా టేబుల్ పైనా.. ఇన్ స్టా స్టేటస్ లు.. రీల్స్ లో.. నిశితంగా చూస్తే తెలుస్తుంది. ఉరకలేసే వయసులో రాసిన కొంటె స్టేటస్ లు అవన్నీ! ఏంత ధైర్యం వారికి? నేటి జెన్ జీ ‘మ్యాడ్’ కోరికాలు బాసూ.. ఎక్కడ, ఎవరు రాశారనేది కాసేపు పక్కన పెడితే… వారి గట్స్‌కి షాక్ అవ్వాల్సిందే. ఇదీ ఓ ధైర్యమే కదా! కచ్చితంగా వారేం కోరుకుంటున్నారో ప్రపంచానికి చెప్పే ప్రయత్నం. ఈ స్వీట్ సిక్స్టీన్లోకి ఎంటర్ అవ్వగానే జెన్ జీ యూత్ కి ప్రపంచం చిత్రంగా కనిపిస్తుందనుకుంటా. వారి అడ్వంచెర్ లు మాములుగా ఉండవు.. ఈ విషయంలో నేట తరం అమ్మాయిలు అస్సలు తగ్గట్లేదు. అప్పుడెప్పుడో టెస్ట్ పుస్తకాల్లో దాచుకున్న నెమలి పించం పురివిప్పి ఆడుతుందేమో!! చేతుల్లో పుస్తకాలు గాల్లోకి! అక్కడే ఓ ట్యూన్ స్టార్ట్ అవుతుంది. ‘హే కళ్ళజోడు కాలేజీ పాప జూడుఎల్లారెడ్డిగూడ కాడ ఆపి జూడు..’’ డ్యాన్స్‌లు… స్టెప్పులు… అమ్మాయి అస్సలు దగ్గేదే లే అంటూ ‘హీరో హోండా బండి మీద పోరడు జూడు.. కూలింగ్ గ్లాసు పెట్టి కట్టింగ్ ఇస్తడాడు..’ అంటూ రివర్స్ కౌంటర్. మనసు మాట వింటుందా? దిల్ చాహ్తాహై… అంటూ మరింత తొందరపెడుతుంది. వయసలాంటిదీ… దాని సహజ నైజం! కానీ ఎవరిని కోరుకుంటుంది? ఎందుకు కోరుకుంటుంది? ఇప్పుడు అవసరమా? కాదా? అనే ప్రశ్నలకు మాత్రం ప్రిపరేషన్ ఉండదు. అంతా ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్సే. ఇంట్లోనూ.. క్లాస్‌లోనూ… వాట్సాప్ గైస్ అంటూ హై-ఫై లు.. ‘ఏం చిచ్చా.. ఈ మధ్య రీల్స్ పెడతాలేవ్. డేటా రీఛార్జ్ చేయమంటావా?’ అంటూ అమ్మళ్లు అబ్బాయ్ ల్ని కామెంట్ చేస్తున్నారు. ‘మన మ్యాథ్స్ సార్ సూపర్ కట్ అవుట్.. ఒక్క రీల్ సార్ తో చేస్తే వేరే లెవల్’ అంటున్నారంటే.. అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు ఎత్తిన తల దించకుండా ఇంటి గేటు తీసే అమ్మళ్లు.. ఇప్పుడు తలెత్తి ప్రపంచాన్ని ఎక్స్ ప్లోర్ చేస్తున్నారు.
నాన్న చెప్పాడంటారు..
కట్టుబాట్లు.. కల్చర్.. సంప్రదాయాలు.. వీటిని రీడిఫైన్ చేస్తున్నారు. సమానత్వాల్ని బ్యాలెన్స్ చేస్తున్నారు. మోహమాటాల్ని పక్కన పట్టేస్తున్నారు.. గెలుపు ఓటములు గురించి ఆలోచించట్లేదు. గిరి గీసుకోకుండా.. ఎగిరి పడే ఉత్సాహంతో బొమ్మరిల్లు సినిమాలో హాసినిలా క్లారిటీ మెయిన్ టెన్ చేస్తున్నారు.. కూతురు ఎప్పుడూ నాన్న కూచీనే కదా. ‘ఏదైనా మంచి పని చేసే ముందు నాన్న నోరు తీపి చేసుకోమ్మన్నాడంటూ…’ డైరీమిల్క్ యాడ్‌ని రీషూట్ చేస్తున్నారు. కొంటెనవ్వులు… జంటగా జతలు. కాళ్లకు చక్రాలు కట్టుకుని కాలంపై యుద్ధం ప్రకటిస్తారు అనుకుంటా. మేఘాలలో తేలిపొమ్మన్నది… అంటూ తుఫానులా దూసుకుపోతుంటారు. బైక్ రైడ్ చేసేది అబ్బాయ్ అనుకునేరు.. అమ్మడే. వలయాల నిలయాలు అంటే వారికి అస్సలు పడదు. అందుకే జెన్ జీ యూత్ ప్రేమకి హద్దులుండవు. మనసులో ఏం దాచుకోరు. ఉదయం బస్ట్స్టాప్లో స్టార్ట్ అయిన ప్రేమ సాయంత్రం ట్యూషన్లో ట్యూన్ అవుతుంది. ఎఫ్బీ వాల్‌పై గ్యాప్‌లు లేకుండా పోస్ట్ అవుతాయి. ఇన్ స్టాలో రీల్స్ ప్లే అవుతాయ్. క్లాస్ రూంలో పాఠం వింటున్నప్పుడు… వారి కళ్లను చూస్తే వాట్ ఏ కాన్సన్ట్రేషన్ అనుకుంటారు. కాస్త కిందికి చూస్తే తెలుస్తుంది. బెంచి కింద నుంచి ఊసులు తరంగాల్లా తిరిగి వెళ్లిపోతాయి. మునివేళ్లు మొబైల్ కీబోర్డుపై మెరుపు వేగంతో కదులుతుంటాయి. టైపింగ్‌లో హైయర్ … షార్ట్‌హ్యాండ్‌లో మాస్టర్ డిగ్రీ రెండూ తెలుసు వారికి. వామ్మో!! వీళ్లు మాములు అమ్మళ్లు కాదని ముక్కుమీద వేలేసుకోవాల్సిందే!
‘లైట్’ ఫిలాసఫీ!
తరచి చూస్తే అమ్మడి మాటల్లోనూ.. మెసేజ్‌ల్లోనూ… ప్రేమలోనూ… రైడ్‌లోనూ… కలిసి చేసే పనిలో.. ఏం ఉంటుంది? అది ప్రేమేనా? కచ్చితంగా ప్రేమైతే కాదు. లవ్ ఫీలింగ్ అయితే అస్సలు కాదు. పక్కన ఉంది ఎవరో??? లవరా? బాయ్ ఫ్రెండేమో అని మనం ఊహించుకుంటాం.. క్లెవర్స్గా ఫీలైపోం. ఏం కాదు.. కావాలంటే వారి ఫేస్బుక్ వాల్‌పై షేరింగ్‌లు… మొబైల్ మెసేజ్‌లను మాటేసి చూడండి. హౌ ఆర్ యూ? వేర్ ఆర్ యూ? వాట్స్ అప్…లాంటి పొడి అక్షరాలే కనిస్తాయి. వాటి వెనక ఎలాంటి ఉద్దేశాలు ఉండవు. కేవలం కమ్యూనికేషనే. వాళ్లేప్పుడూ ఒకే కూల్ డ్రింక్‌లో రెండు స్ట్రాలేసుకుని తాగరు. ఎందుకంటే వాళ్లు బ్యాకరీకి వెళ్లేది భుజాలు రాసుకుంటూ కూర్చోవడానికి కాదు. పఫ్‌లు తింటూ ఫన్ చేయడానికే. ఒకవేళ ఆ ప్రేమనుకుని ఎవరైనా ప్రపోజల్ పెడితే.. . రెస్పాన్స్ రాష్‌గా ఉండదు. ‘లైట్ లే!’ లైన్ మార్చేస్తారు. వీరికి ద్వేషించడం కూడా తెలియదేమో. అందుకే నేమో… బెదిరింపు ప్రేమలు.. భయపెట్టే ప్రేమలు… అమ్మడి దరిదాపుల్లోకి రాకుండా చూసుకుంటారు.
ఈజీగా ట్యూన్ అయిపోతున్నారు..
క్లాసులు మారుతూ… సెమిస్టర్ల మెట్లెక్కే క్రమంలో… ఎక్కడా జంక్కే ప్రసక్తే లేదు. చివరికి చదువుల క్యాంపస్ దాటి కొలువుల కాంపౌండ్ లోకి అడుగుపెట్టినా. అంతే చెలాకీగా దూసుకెళ్తున్నారు. గట్టిగా మాట్లాడితే.. టీఎల్ కే సటైర్లు పడుతున్నాయ్. ఆన్ టైమ్ ని ప్రాజెక్టుని ఫినిష్ చేయడమే కాదు.. పార్టీకి కూడా ఆన్ టైమ్ కి వచ్చేస్తున్నారు. జిల్.. జిల్ జింగా అంటూ బాస్ లో బిల్లు కట్టించి మరీ వెళ్తున్నారు.. సో.. ఈ క్రేజీ అమ్మళ్ల సందడి చూస్తుంటే కొలువుల మార్కెట్లో కూడా తమదే పై చేయిగా సాగిపోతున్నారు. రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లా.. ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి బిడ్డగా.. ఎక్కడికక్కడే ఈ జెన్ జీ అమ్మళ్లు.. జీవించేందుకు ఇష్టపడుతున్నారు. నేటి తరం లైఫ్ స్టైల్ ని చెప్పనే చెబుతున్నారు.






