సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా జనవరి 10న విడుదల కానుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్‌ను తాజాగా ఎస్‌ఎస్ రాజమౌళి విడుదల చేశారు. రామ్ చరణ్, కియారా అడ్వాణీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్‌లో రామ్ చరణ్ నందన్, అప్పన్న అనే రెండు విభిన్న పాత్రల్లో ఆకట్టుకున్నారు. డైలాగ్స్, అంజలి నటన, తమన్ సంగీతం ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. సినిమా అద్భుత విజువల్స్, ఎమోషనల్ సన్నివేశాలు, శంకర్ మార్క్ కథనంతో సంక్రాంతికి భారీ హిట్‌గా నిలవబోతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.





