ఈ సంక్రాంతికి ప్రేక్షకుల కోసం మూడు భారీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

గేమ్ ఛేంజర్
రామ్‌చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10న విడుదల కానుంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో చరణ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. అవినీతి రాజకీయ నాయకుడు, కలెక్టర్ మధ్య సాగే యుద్ధమే ప్రధాన కథ. కియారా అడ్వాణీ కథానాయికగా నటించగా, తమన్ సంగీతం అందించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి సంబరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

డాకు మహారాజ్
బాలకృష్ణ ప్రధాన పాత్రలో బాబీ దర్శకత్వం వహించిన ‘డాకు మహారాజ్’ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్ బాలకృష్ణకు ఓ కొత్త పాత్రను పరిచయం చేస్తోంది. శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటించారు. తమన్ మ్యూజిక్ మరో విశేషం.

సంక్రాంతికి వస్తున్నాం
వెంకటేశ్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ జనవరి 14న విడుదల అవుతుంది. క్రైమ్+ఎంటర్‌టైన్‌మెంట్ కలయికలో రూపొందిన ఈ చిత్రంలో వెంకీ ఓ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. భీమ్స్ సంగీతం అందించిన ఈ చిత్రం వినోదంతో పాటు భావోద్వేగాలను అందించనుంది.





