‘పుష్ప 2’ వసూళ్ల హవా!!: బాహుబలి2 సినిమాని వెనక్కి నెట్టి 1831 కోట్లకు చేరింది

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2’ చిత్రం వసూళ్లలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. 32 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్ల గ్రాస్‌ వసూలు చేసి, అత్యధిక వసూళ్ల సాధించిన భారతీయ చిత్రాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో, ‘బాహుబలి 2’ (రూ.1810 కోట్లు) రికార్డును అధిగమించింది. కాగా, తొలి స్థానంలో ‘దంగల్‌’ (రూ.2000 కోట్లు) కొనసాగుతోంది.

టాప్‌ 8 ఇండియన్‌ మూవీస్‌ వసూళ్ల జాబితా

  1. దంగల్‌ – రూ. 2000+ కోట్లు
  2. పుష్ప 2 – రూ. 1831 కోట్లు
  3. బాహుబలి 2 – రూ. 1810 కోట్లు
  4. ఆర్‌ఆర్‌ఆర్‌ – రూ. 1387+ కోట్లు
  5. కేజీయఫ్‌ 2 – రూ. 1250+ కోట్లు
  6. కల్కి 2898 ఏడీ – రూ. 1153+ కోట్లు
  7. జవాన్‌ – రూ. 1148+ కోట్లు
  8. పఠాన్‌ – రూ. 1050+ కోట్లు

‘పుష్ప 2’ తెలుగు సినిమాల దిశగా తొలి స్థానాన్ని అందుకోగా, బాలీవుడ్‌ మార్కెట్‌లోనూ రికార్డులు సృష్టించింది. 15 రోజుల్లోనే రూ.632 కోట్లు (నెట్‌) హిందీ మార్కెట్‌ నుంచి రాబట్టగా, 31 రోజుల్లో ఈ మొత్తం రూ.806 కోట్లకు చేరింది. ‘పుష్ప 2’ ఓటీటీ రిలీజ్‌ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ చిత్ర బృందం ఇప్పటికే 56 రోజులకు ముందుగా ఏ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లోనూ విడుదల కాదని స్పష్టంచేసింది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *