‘సంక్రాంతికి వస్తున్నాం’: వెంకటేశ్ పాడిన ‘బ్లాక్‌బస్టర్ పొంగల్’ పాట మామూలుగా ఉండదు!

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని ‘బ్లాక్‌బస్టర్ పొంగల్’ అనే పాట వెంకటేశ్‌గారికి చాలా నచ్చిందని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలిపారు. “అయన స్వయంగా ఆ పాట పాడతానని చెప్పడంతో నేను షాక్‌ అయ్యాను. కానీ ఆయన 20 నిమిషాల్లో ఆ పాట పాడటంతో సంగీత దర్శకుడు భీమ్స్‌ కూడా షాక్‌ అయ్యాడు” అని అన్నారు. వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కాబోతోంది.

సంక్రాంతి ప్రత్యేకంగా రూపొందించిన కథ

అనిల్ రావిపూడి మాట్లాడుతూ, “మా కాంబోలో మూడో సారి చేసే సినిమాని సంక్రాంతికి తీసుకొస్తే బావుంటుందని నిర్ణయించాం. ‘సంక్రాంతికి వస్తున్నాం’ కథ ఒక రెస్క్యూ ఆపరేషన్‌కి సంబంధించినది. వెంకటేశ్‌గారి పాత్ర ఒక భార్య, మాజీ ప్రేయసి మధ్య నలిగే భర్తగా ఉంటుంది” అని వివరించారు. కోవిడ్‌ తర్వాత థియేటర్స్‌కి జనాలు రాకపోతే సినిమాకు రీచ్ ఉండదని, అందుకే ప్రమోషన్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టామని చెప్పారు. “వెంకటేశ్‌గారు సరదాగా అల్లరి చేయడం ప్రమోషన్స్‌కు ఎంతో సహాయపడింది” అని అన్నారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *