గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఆసహనం!!: ఇండస్ట్రీ నుంచి ఎవరూ కాల్ చేయలేదు!!

మలయాళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇటీవల తన కెరీర్‌లో ఎదురైన ఇబ్బందుల గురించి అసహనం వ్యక్తం చేశారు. 2017లో తెరకెక్కించిన తన చిత్రం ధృవ నచ్చతిరమ్ (తెలుగులో ధృవనక్షత్రం) విడుదల కాకపోవడం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. “నా జీవితంలో కీలకమైన సమయంలో ఇండస్ట్రీ నుంచి ఎవరూ కాల్ చేయలేదు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు కూడా ఎవరూ ప్రయత్నించలేదు. కేవలం ధనుశ్ సార్, లింగుసామి మాత్రమే సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నించారు, కానీ కొన్ని సమస్యల కారణంగా అది సాధ్యపడలేదు,” అని గౌతమ్ వేదన వ్యక్తం చేశారు.

ధృవ నచ్చతిరమ్: ఆర్థిక సమస్యలపై ప్రభావం

విక్రమ్ హీరోగా, రీతూ వర్మ, ఆర్. పార్తిబన్, సిమ్రాన్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా 2017లోనే షూటింగ్ పూర్తయింది. అయితే ఆర్థిక సమస్యల కారణంగా ఏడేళ్లుగా విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమాపై పలుమార్లు గౌతమ్ తన బాధను వెల్లడించగా, ప్రేక్షకులు ఇప్పటికీ ఈ చిత్రాన్ని చూడాలని ఎదురుచూస్తున్నారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ రాణిస్తున్నారు. 2024లో రత్నం, హిట్ లిస్ట్, హిట్లర్: విడుతలై పార్ట్-2 చిత్రాల్లో కనిపించిన గౌతమ్, త్వరలో వరాహం, బజూకా, తలపతి 69 చిత్రాల్లో నటించనున్నారు. గౌతమ్ త్వరలో మలయాళంలో డొమినిక్ అండ్ లేడీస్ పర్స్ ద్వారా దర్శకుడిగా అరంగేట్రం చేయనున్నారు. మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం జనవరి 23న విడుదల కానుంది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *