15 ఏళ్ల శ్రమతో ‘ఇందిరాగాంధీ భవన్’.. 2008 స్థలం కేటాయిస్తే.. 2009 నిర్మాణం ప్రారంభం!!

కాంగ్రెస్ పార్టీ తన కొత్త కేంద్ర కార్యాలయాన్ని ఢిల్లీలో ప్రారంభించింది. ఈ కొత్త భవనానికి ‘ఇందిరాగాంధీ భవన్’ అని పేరు పెట్టారు. సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తదితరులు పాల్గొన్నారు.

ఐదుదశాబ్దాల తర్వాత కొత్త ఆఫీస్‌

ప్రస్తుతం అక్బర్ రోడ్డు 24వ నంబర్‌ బంగ్లాలో కాంగ్రెస్‌ కార్యాలయం కొనసాగుతుండగా, సొంత భవనాలకు కేంద్రం అనుమతి నిరాకరించిన నేపథ్యంలో పార్టీ కొత్త ఆఫీస్‌ను 9A కోట్లా రోడ్డులో నిర్మించింది. ఈ భవనం 6 అంతస్తులతో అత్యాధునిక సౌకర్యాలను కలిగి ఉంది. 2008లో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి స్థలం కేటాయించగా, 2009లో నిర్మాణ పనులు మొదలయ్యాయి. 15 ఏళ్ల శ్రమతో ఈ భవన నిర్మాణం పూర్తి అయింది.

భవన విశేషాలు

కొత్త భవనానికి ‘ఇందిరాగాంధీ భవన్’ అని నామకరణం చేయగా, 1978 నుంచి కాంగ్రెస్ కార్యకలాపాలకు కేంద్రస్థానంగా ఉన్న అక్బర్ రోడ్డు కార్యాలయాన్ని తరలిస్తున్నారు. అయితే, కొత్త కార్యాలయం ప్రారంభమైనా అక్బర్ రోడ్డులోనూ కొన్ని కార్యకలాపాలు కొనసాగుతాయని పార్టీ నేతలు తెలిపారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
Breaking News
కేటగిరి

మా న్యూస్ అప్డేట్లు కోసం సబ్‌స్క్రైబ్ చేయండి!

Everyday we discover real news for you.