బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ముంబయి లీలావతి ఆస్పత్రి నుంచి ఈ రోజు డిశ్చార్జ్ అవనున్నారు. సైఫ్ డిశ్చార్జ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని ఆస్పత్రి వైద్యులు ధృవీకరించారు. ఈనెల 16న తన ఇంట్లో చోరీకి ప్రయత్నించిన దుండగుడు సైఫ్‌పై కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. సైఫ్ వెన్నెముకకు తీవ్రగాయం కావడంతో సర్జరీ చేసిన వైద్యులు వెన్నెముక నుంచి కత్తిని తొలగించారు.
నిందితుడి వేలిముద్రలు..
ఈ కేసులో నిందితుడిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్ ఝలోకటి జిల్లాకు చెందిన నిందితుడు గత ఐదు నెలలుగా ముంబయిలో హౌస్ కీపింగ్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. సైఫ్ ఇంటి కిటికీపై, నిచ్చెనపై లభించిన వేలిముద్రలను ఫోరెన్సిక్ బృందం పరిశీలించింది. నిందితుడిపై విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.





