తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో పరిచయం అక్కర్లేని పేరు సిల్క్ స్మిత. ఆమె ఒకవేళ ఈతరంలో పుడితే, ఇప్పటి ఫ్యాషన్ ట్రెండ్స్‌ని ఫాలో చేస్తే ఆమె లుక్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా సిల్క్ స్మితను రూపొందించిన విధానం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ వీడియోని షేర్ చేసి, “What can A I not do? SILK SMITHA never looked more BEAUTIFUL” అంటూ స్పందించారు. ఈ వీడియోలో సిల్క్ స్మిత ఆధునిక శైలిలో కనిపిస్తూ, నేటి ఫ్యాషన్ ట్రెండ్స్‌ను అనుసరిస్తోంది.
సిల్క్ స్మిత గురించి
సిల్క్ స్మిత, అసలు పేరు విజయలక్ష్మి, 1960 డిసెంబర్ 2న ఏలూరు జిల్లా కొవ్వలి గ్రామంలో జన్మించారు. ఆమె దక్షిణాది చిత్ర పరిశ్రమలో 200కి పైగా సినిమాల్లో నటించారు. 90లలో స్పెషల్ సాంగ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె, తన అందంతో మరియు అభినయంతో సినీ ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టిన సిల్క్ స్మిత, తన కెరీర్‌లో అనేక విజయాలను సాధించారు. అయితే, వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాలు ఆమెను తీవ్రంగా ప్రభావితం చేశాయి. 1996లో ఆమె మరణం, దాని వెనుక ఉన్న కారణాలు ఇంకా చర్చనీయాంశంగా ఉన్నాయి.
సోషల్ మీడియా స్పందన
ఈ వీడియో విడుదలైన తర్వాత, నెటిజన్లు ఆమె రూపాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. “ఆ అందమే మళ్లీ పుట్టిందా?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో ద్వారా సిల్క్ స్మిత అందం మరియు శైలి మరోసారి ప్రల ముందుకు వచ్చింది






