ట్రంప్ కీలక ప్రకటన: ఉద్యోగులకు బైఅవుట్ ఆఫర్!! 8 జీతం తీసుకుని వెళ్లిపోండి!!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా బైఅవుట్‌ను ప్రకటించారు. ఈ నిర్ణయం ద్వారా ఉద్యోగుల ప్రమాణాలు, ప్రవర్తన, అనుకూలతలను పెంచాలని ఆయన తెలిపారు. ఈ మేరకు అమెరికా ప్రభుత్వానికి చెందిన ఆఫీస్‌ ఆఫ్‌ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి ఒక మెమోను జారీ చేశారు. 20 లక్షల మంది ఉద్యోగులకు ఈ మెయిల్ పంపబడింది.

10-15 శాతం మంది మొగ్గుచూపొచ్చు!!

స్వచ్ఛందంగా ఉద్యోగాలను వదులుకుంటే ఎనిమిది నెలల వేతనాన్ని ఒకేసారి చెల్లిస్తామని ఆ మెమోలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఫిబ్రవరి 6లోగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కరోనా సంక్షోభం తర్వాత చాలామంది రిమోట్ విధానంలో పని చేస్తున్నారు. వారు ఆఫీసుకు వచ్చి పనిచేయడం ఇష్టంలేని వారు ఈ బైఅవుట్ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు. దాదాపు 10-15 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఆఫర్‌ను ఎంచుకుంటారని అంచనా వేస్తున్నారు. 

Description: President Donald Trump announces a buyout offer for federal workers, providing eight months’ pay for those who voluntarily resign, aiming to reduce the number of government employees in the U.S.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *