పుష్పా 2 నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల సందర్భంగా ప్రత్యేకంగా షూట్ చేసిన ప్రోమో క్లిప్ వైరల్.. సినిమా విడుదల తర్వాత గాలికి వదిలేయకుండా, స్ట్రీమింగ్ ప్రమోషన్‌కే ప్రత్యేక శ్రద్ధ... ఇది కసి అంటే..!
పుష్పా 2 (Pushpa 2) మేకర్స్ నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా విడుదల సందర్భంగా ప్రత్యేకంగా ఒక ప్రమోషన్ వీడియోని షూట్ చేసి, ఆ క్లిప్‌ను ఇంటర్నెట్లో రిలీజ్ చేశారు. సినిమా షూటింగ్ సమయంలోనే ఓ ప్రత్యేక భాగాన్ని స్ట్రీమింగ్ ప్రమోషన్ కోసం రూపొందించడం ఇండస్ట్రీలో అరుదుగా కనిపించే ట్రెండ్. సాధారణంగా సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు వెళ్లినప్పుడు కొత్తగా ప్రచారం చేయరు. కానీ పుష్పా 2 టీమ్ నెట్‌ఫ్లిక్స్ కోసం ప్రత్యేకంగా షూట్ చేయడం సినిమాపై ఉన్న కాన్ఫిడెన్స్, మార్కెటింగ్ స్ట్రాటజీని చూపిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






