సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటిస్తున్న “ఇట్స్ కంప్లికేటెడ్” చివరికి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. చాలా కాలంగా వేచి చూస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటించగా, రానా దగ్గుబాటి కూడా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. “ఇట్స్ కంప్లికేటెడ్” అనేదే సినిమా టైటిల్ అయినప్పటికీ, ఇది ప్రేక్షకులను సరదాగా నవ్వించడంతో పాటు అనూహ్య మలుపులతో ఆకట్టుకునేలా ఉంటుందని టీజర్, ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది!!. స్టార్ బాయ్ సిద్ధు మరోసారి తన మార్క్ మజాకా టచ్‌తో రొమాంటిక్ డ్రామాకు కొత్త మజాను తెస్తాడా? ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు తేలిపోతోంది!!.





