ఎల్‌ఐసీ పాలసీదారులు అప్రమత్తంగా ఉండలి!: ఫేక్ యాప్స్‌తో మోసపోవద్దు!!

  • ఫేక్ యాప్స్‌తో మోసపోవద్దని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హెచ్చరిక
  • అధికారిక వెబ్‌సైట్, యాప్‌ల ద్వారానే లావాదేవీలు చేయాలని సూచన.. నకిలీ యాప్స్‌పై లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అప్రమత్తత

ఎల్‌ఐసీ ఇండియా పేరుతో నకిలీ మొబైల్ అప్లికేషన్లు చెలామణి అవుతున్నాయని గుర్తించిన ప్రభుత్వరంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) పాలసీదారులకు తాజా హెచ్చరిక జారీ చేసింది. తమ అధికారిక వెబ్‌సైట్, ఎల్‌ఐసీ డిజిటల్ యాప్ ద్వారా మాత్రమే లావాదేవీలు జరపాలని, ఇతర మార్గాల్లో చేసే చెల్లింపులకు ఎల్‌ఐసీ బాధ్యత వహించదని స్పష్టంచేసింది. పాలసీదారులు ఎల్‌ఐసీ అధికారిక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే, ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌లోని సంబంధిత లింక్‌పై క్లిక్ చేసి, అవసరమైన (ఆండ్రాయిడ్/ఐఓఎస్) యాప్‌ను పొందాలని సంస్థ సూచించింది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *