- ఫస్టాఫ్ యావరేజ్, కానీ సెకండాఫ్ దుమ్మురేపింది – ఫ్యాన్స్ రివ్యూ
- సాయి పల్లవి, నాగచైతన్య కెమిస్ట్రీ సూపర్, దేవీ శ్రీ ప్రసాద్ బీజీఎమ్ హైలైట్
అక్కినేని హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ మూవీ ఫిబ్రవరి 7న థియేటర్లలో సందడి చేసింది. ఓవర్సీస్లో ముందుగా షోలు పడటంతో, నెటిజన్లు సినిమా ఎలా ఉందో ట్విటర్ ద్వారా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారుల నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించగా, దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలం అని అభిమానులు చెబుతున్నారు.
“చైతూ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్”
నాగచైతన్య ఈ సినిమాలో తన కెరీర్లో ఎన్నటికీ మర్చిపోలేని నటనను కనబరిచాడని అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఫస్టాఫ్ కొంచెం నెమ్మదిగా సాగినప్పటికీ, సెకండాఫ్ మాత్రం అద్భుతంగా ఉందని.. ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకుల హృదయాలను తాకాయని ట్విటర్లో కామెంట్లు వస్తున్నాయి. సినిమాలో దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ (BGM) గూస్బంప్స్ తెప్పించిందని, ముఖ్యంగా “బుజ్జి తల్లి” పాట సినిమాను కొత్త స్థాయికి తీసుకెళ్లిందని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. మొత్తానికి, కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ, సినిమా టోటల్గా బాగుందని, నాగచైతన్య – సాయి పల్లవి జోడీ మరోసారి అదరగొట్టిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.





