నాగ్‌పూర్ వన్డేలో శ్రేయస్ అయ్యర్ మెరుపు ఇన్నింగ్స్ – అరుదైన రికార్డు

  • 30 బంతుల్లో హాఫ్ సెంచరీ, 36 బంతుల్లో 59 పరుగులతో ఆకట్టుకున్న అయ్యర్
  • వన్డేల్లో నాలుగో స్థానం నుంచి.. 50+ సగటుతో, 100+ స్ట్రైక్ రేట్‌తో 1000 పరుగులు చేసిన తొలి బ్యాటర్

ఇంగ్లండ్‌తో నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఆరు నెలల విరామం తర్వాత జట్టులోకి వచ్చిన అయ్యర్, 30 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి, 36 బంతుల్లో 59 పరుగులతో ఔటయ్యాడు. ఈ క్రమంలో, వన్డే క్రికెట్‌లో నాలుగో స్థానం నుంచి 50+ సగటుతో, 100+ స్ట్రైక్ రేట్‌తో 1000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా అయ్యర్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్ నిర్ధేశించిన 249 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 38.4 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శుబ్‌మన్‌ గిల్‌ (87), శ్రేయస్‌ అయ్యర్‌ (59), అక్షర్‌ పటేల్‌ (52) అర్ధ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో హర్షిత్‌ రాణా, రవీంద్ర జడేజా తలా మూడు వికెట్లు తీశారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే కటక్‌ వేదికగా ఫిబ్రవరి 9న జరగనుంది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *