- తక్కువ వడ్డీ రేటుతో ఎక్కువ రుణం కావాలా?
- పూచీకత్తు లేకుండా వ్యక్తిగత రుణం తీసుకోవచ్చా?
జీవితంలో అప్పు అవసరం ఎప్పుడు వస్తుందో చెప్పలేం. అప్పటివరకు బ్యాంక్ పేరు కూడా పలకని మనుషులు కూడా ఒకింత ఆర్థిక ఇబ్బందుల్లో పడి లోన్ కోసం తలుపుతట్టాల్సి రావచ్చు. కానీ, పూచీకత్తు లేకుండా రుణం తీసుకోవాలంటే? అదీ ఎక్కువ మొత్తం కావాలంటే? ఇదే సందిగ్ధంలో చాలామంది ఉంటారు.
“సెక్యూర్డ్ – అన్‌సెక్యూర్డ్” లోన్స్ మధ్య గందరగోళం ఇదేనా?
పూచీకత్తు పెట్టడానికి ఆస్తుల్లేవు, కానీ డబ్బు కావాలి – అన్‌సెక్యూర్డ్ లోన్ తీసుకోవచ్చు! కానీ, బ్యాంకులు మీరు ఎంతవరకు నమ్మదగినవారు? రుణం తిరిగి చెల్లించగలరా? అని చూసుకుంటాయి. వడ్డీ రేటు కాస్త ఎక్కువ. పూచీకత్తు పెట్టడానికి ఇల్లు, భూమి ఉంది, తక్కువ వడ్డీ కావాలి – సెక్యూర్డ్ లోన్ బెస్ట్! ఎక్కువ మొత్తంలో తీసుకోవచ్చు, కానీ ఆస్తి తాకట్టు పెట్టాల్సిందే.
ఏది మీకు బెస్ట్?
“నేను నెలకు రూ.50,000 సంపాదిస్తున్నా, కానీ నాకు పూచీకత్తు పెట్టడానికి ఏ ఆస్తీ లేదు. ఏం చేయాలి?” మీ జీతాన్ని, క్రెడిట్ స్కోర్‌ను బట్టి అన్‌సెక్యూర్డ్ లోన్ మంజూరు అవుతుంది. అయితే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. “నా దగ్గర ఓ అపార్ట్మెంట్ ఉంది. తక్కువ వడ్డీకి ఎక్కువ రుణం కావాలి.” సెక్యూర్డ్ లోన్ తీసుకుంటే మీ ఆస్తిని తాకట్టు పెట్టాలి. కానీ, వడ్డీ తక్కువ ఉంటుంది. మీరు ఎంత రుణం తీసుకోవాలనుకుంటున్నారు? నెలకి ఎంత తిరిగి చెల్లించగలరు? రిస్క్ తీసుకోవచ్చా? అనే విషయాల్ని బట్టి నిర్ణయం తీసుకోండి. చిన్న అవసరాలకు అన్‌సెక్యూర్డ్ లోన్ సరిపోతే, పెద్ద మొత్తానికి సెక్యూర్డ్ లోన్ ఉత్తమం.





