కెనడాలో విమాన ప్రమాదం: రన్ వే పై విమానం ఫల్టీలు కొడుదూ బోల్తా పడింది!!

  • టొరంటోలోని పియర్సన్ ఎయిర్‌పోర్టులో డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం అదుపు తప్పి బోల్తా పడింది.
  • ముగ్గురు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
https://twitter.com/ErrolWebber/status/1891589945292198007

కెనడాలోని టొరంటోలో జరిగిన విమాన ప్రమాదంలో 18 మందికి గాయాలయ్యాయి. డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం, అమెరికాలోని మిన్నె పొలిస్‌ నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. పియర్సన్ ఎయిర్‌పోర్టులో రన్‌వేపై దిగిన తర్వాత అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉందని విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. ప్రమాదం జరిగిన వెంటనే భద్రత సిబ్బంది అప్రమత్తమయ్యారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు అధికారులు తెలిపారు. ఈ విమానంలో 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి, ఇది ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *