ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీకెళ్లాలి!! – పవన్‌ కల్యాణ్‌ వ్యంగ్య వ్యాఖ్యలు

  • జనసేన ఉన్నప్పుడు వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు?
  • ఓట్ల శాతం ప్రకారం హోదా కోరితే జర్మనీకి వెళ్లాలని ఎద్దేవా

ప్రతిపక్ష హోదా విషయంలో వైఎస్సార్‌సీపీ చేస్తున్న డిమాండ్‌పై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వ్యంగ్యంగా స్పందించారు. అసెంబ్లీలో అధికార టీడీపీ తర్వాత జనసేన రెండో అతిపెద్ద పార్టీగా ఉందని, అలాంటప్పుడు ప్రతిపక్ష హోదా వైఎస్సార్‌సీపీకి ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

“ఇక్కడ కాదండీ, జర్మనీకెళ్లాలి!”

గవర్నర్‌ ప్రసంగం ముగిసిన తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద పవన్‌ మాట్లాడుతూ, “ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీకెళ్లాలి. అక్కడ మాత్రమే అది సాధ్యమవుతుంది” అంటూ ఎద్దేవా చేశారు. “ప్రతిపక్ష హోదా ఎవరో ఇచ్చేది కాదు. అది రూల్స్‌ ప్రకారం నడుస్తుంది. ఈ ఐదేళ్లలో మీకు హోదా ఇవ్వబడదు. దానికి మీరు సిద్ధంగా ఉండండి” అని వైఎస్సార్‌సీపీకి సూచించారు.గవర్నర్‌ ప్రసంగాన్ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు బహిష్కరించడాన్ని తప్పుపట్టిన పవన్‌, “ఇది ఎవరో ఇచ్చే హోదా కాదు, గౌరవనీయులైన సీఎం చంద్రబాబుగారి చేతుల్లో లేదు. అసెంబ్లీ నియమావళి ప్రకారమే నిర్ణయం ఉంటుంది” అని స్పష్టం చేశారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *