- అలెఫ్ ఎరోనాటిక్స్ తయారు చేసిన ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారు విజయవంతంగా టెస్ట్ చేయబడింది.
- ఈ కారు ధర ఒక్కోటి 30 వేల డాలర్లు.
అమెరికాలోని అలెఫ్ ఎరోనాటిక్స్ అనే సంస్థ తమ తొలి ఎయిర్ ఫ్లెయింగ్ కారును టెస్ట్ చేసింది. ఈ కారు రోడ్డుపై విజయవంతంగా మరో కారు మీదినుంచి ఫ్లై చేస్తూ వెళ్లింది. దీంతో తమ ప్రయత్నం సక్సెస్ అయిందని సంస్థ తెలిపింది. ఈ కార్లు అందుబాటులోకి వస్తే, ట్రాఫిక్ చిక్కులు ఉండకపోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారు ధర ఒక్కోటి 30 వేల డాలర్లు. ఈ కారు 110 మైళ్లు గాలిలో, 200 మైళ్లు రోడ్డుపై ప్రయాణించగల రేంజ్‌తో తీసుకురానున్నారు. ఈ ఫ్లయింగ్ కారుకు యూఎస్ ప్రభుత్వం నుంచి చట్టపరమైన ఆమోదం కూడా లభించింది. ఈ ఫ్లయింగ్ కార్లు సాధారణ పట్టణ, గ్రామీణ రోడ్లపై నడపడానికి అభివృద్ధి చేయబడుతున్నాయి. ఇవి ట్రాఫిక్ జామ్‌లను తగ్గించడంలో సహాయపడతాయని ఆశిస్తున్నారు.






