- ఎనిమిది భాషల్లో ‘ది ప్యారడైజ్’ గ్లింప్స్ రిలీజ్
- స్పానిష్‌లోనూ డబ్బింగ్ చెప్పనున్న నాని
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ‘ది ప్యారడైజ్’ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం మార్చి 3న గ్లింప్స్ రిలీజ్ కానుంది. ఆసక్తికరంగా, ఈ గ్లింప్స్ 8 భాషల్లో విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లిష్ భాషల్లోనూ వస్తుంది.
నాని స్పానిష్ డబ్బింగ్
ఈ సినిమాలో నాని స్వయంగా స్పానిష్‌లో డబ్బింగ్ చెప్పనున్నారు. భారతీయ సినీ ఇండస్ట్రీలో ఏ నటుడూ ఇంతకు ముందు ఇలా చేయలేదు. అంతే కాదు, సినిమా స్పెయిన్‌లో కూడా థియేట్రికల్ రిలీజ్ అవుతుందని సమాచారం. ‘ది ప్యారడైజ్’ చిత్రం పక్కా యాక్షన్ డ్రామా కానుంది. ఇది సాధారణ యాక్షన్ మూవీ కాదని, ప్రత్యేకమైన బ్యాక్‌డ్రాప్ లో ఉంటుందని టాక్. స్పానిష్ జనాభాతో నానికి లింక్ ఉన్న కథేనా? అనే ప్రశ్నలపై మరింత క్లారిటీ గ్లింప్స్ రిలీజ్ తర్వాత రానుంది.





