- రెండేళ్ల ప్రేమకు ఫుల్‌స్టాప్ పెట్టినట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం
- కెరీర్, పెళ్లి విషయంలో అభిప్రాయ భేదాలు కారణమని టాక్
నటి తమన్నా భాటియా – నటుడు విజయ్ వర్మ ప్రేమకి బ్రేక్ పడిందని బాలీవుడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇంతకాలం ప్రేమలో ఉన్న ఈ జంట, ఇకపై కేవలం స్నేహితులుగానే కొనసాగాలని నిర్ణయించుకున్నారని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. వీరి బ్రేకప్‌కు గల ప్రధాన కారణం కెరీర్‌పై అభిప్రాయ భేదాలే అని తెలుస్తోంది. 35 ఏళ్ల తమన్నా పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలని భావించగా, విజయ్ వర్మ మాత్రం ప్రస్తుతం కెరీర్‌పైనే ఫోకస్ పెట్టాలనుకున్నారని సమాచారం. ఈ క్రమంలో మనస్పర్థలు పెరిగి, విడిపోవాలని నిర్ణయించుకున్నారని టాక్. 2023లో విడుదలైన ‘లస్ట్ స్టోరీస్ 2’ సెట్‌లో మొదలైన వీరి ప్రేమ కథ, ఇప్పుడు అంతం కావడం సినీప్రియులను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, తమ రిలేషన్‌షిప్ గురించి తమన్నా, విజయ్ వర్మ ఇంకా అధికారికంగా స్పందించలేదు.





