- యూకే పార్లమెంట్‌లో చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారం
- “అన్నయ్యను తండ్రిగా భావిస్తాను” – పవన్‌కల్యాణ్ భావోద్వేగ పోస్ట్
సినీ, సేవా రంగాల్లో విశేష కృషి చేసిన మెగాస్టార్ చిరంజీవిని యూకే పార్లమెంట్‌లో ఘనంగా సత్కరించారు. హౌస్ ఆఫ్ కామన్స్ ఈ అరుదైన గౌరవాన్ని అందించడంతో చిరంజీవి కీర్తి అంతర్జాతీయంగా మరింత పెరిగింది. తమ్ముడు పవన్‌కల్యాణ్ ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేస్తూ భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు. “సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ కుమారుడిగా ప్రారంభమైన జీవితం… మెగాస్టార్‌గా మారింది. ఇది కళామతల్లి దీవెనలే. మీకు తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం. అన్నయ్యగా కంటే.. తండ్రిగా భావిస్తాను” అని పవన్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.





