- విశ్వక్సేన్ ఇంట్లో వజ్రాభరణాలు, హెడ్‌ఫోన్ దొంగతనం
- ఫిలింనగర్ పోలీసులు నిందితులను పట్టుకుని రిమాండ్
హీరో విశ్వక్సేన్ ఇంట్లో చోరీకి పాల్పడిన ముగ్గురు యువకులను ఫిలింనగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 14న తెల్లవారుజామున దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి వజ్రాభరణాలతో పాటు హెడ్‌ఫోన్ ఎత్తుకెళ్లారు. విశ్వక్సేన్ తండ్రి రాజు ఫిర్యాదుతో పోలీసులు విచారణ ప్రారంభించారు.
సీసీ కెమెరాలతో నిందితుల పట్టివేత
ఘటనపై 200కి పైగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు, బేగంపేట మయూరిమార్గ్‌లో అద్దెకు ఉంటున్న ముగ్గురు ఫుడ్ డెలివరీ బాయ్స్ – భీమవరపు స్వరాజ్ (21), బొల్లి కార్తీక్ (22), నేరేడుమల్లి సందీప్ (21) – ను అదుపులోకి తీసుకున్నారు. వీరు విశ్వక్సేన్ ఇంటిని వారం పాటు రెక్కీ నిర్వహించి, ఇంటి తాళాలు పగులగొట్టి డైమండ్ రింగులు, హెడ్‌ఫోన్ దొంగిలించారు. అరెస్టు చేసిన ముగ్గురి వద్ద నుంచి వజ్రాభరణాలు, 3 మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.





