- సినిమా, సమాజానికి చేసిన సేవలకు గౌరవ వందనం
- పార్లమెంటు సభ్యుల సమక్షంలో ప్రత్యేక సత్కారం
ప్రముఖ నటుడు చిరంజీవి (Chiranjeevi) యూకే హౌస్ ఆఫ్ కామన్స్‌లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించబడ్డారు. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమా, సామాజిక సేవా రంగాల్లో చిరు చేసిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని అందుకున్నారు. యూకే లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు ఎంపీలు సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్మాన్ తదితరులు హాజరయ్యారు.
చిరంజీవికి అంతర్జాతీయ గౌరవం
గత ఏడాది గిన్నిస్ వరల్డ్ రికార్డు, ఏయన్నార్ జాతీయ పురస్కారం, ఐఫా అవార్డు, పద్మ విభూషణ్ వంటి ప్రతిష్ఠాత్మక గౌరవాలు దక్కిన చిరంజీవికి ఇప్పుడు యూకే పార్లమెంటు గుర్తింపు లభించింది. 156 సినిమాలు, 537 పాటలు, 24 వేల స్టెప్పులతో సినీ ప్రేమికులను అలరించిన చిరు తన సినీ ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు.





