యాక్టింగ్‌ చేస్తున్న గౌతమ్‌ – న్యూయార్క్‌ థియేటర్‌లో అదరగొట్టేస్తున్నాడు!!

  • న్యూయార్క్‌లో యాక్టింగ్‌ శిక్షణ తీసుకుంటున్న గౌతమ్‌ ఘట్టమనేని
  • స్కిట్‌లో నటన ప్రదర్శన – నెటిజన్ల ప్రశంసలు

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తనయుడు గౌతమ్‌ ఘట్టమనేని యాక్టింగ్‌లో తన ప్రతిభను నిరూపించుకుంటున్నాడు. ప్రస్తుతం న్యూయార్క్‌లోని ప్రముఖ యూనివర్సిటీలో నటనలో శిక్షణ పొందుతున్న గౌతమ్‌, ఓ స్కిట్‌లో పాల్గొని తన టాలెంట్‌ను బయటపెట్టాడు. ఈ స్కిట్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఆగ్రహావేశాలతో అభినయం – నెటిజన్ల ప్రశంసలు

వీడియోలో తొలుత చిరునవ్వుతో ప్రశాంతంగా ఉన్న గౌతమ్‌, క్షణాల్లోనే ఆగ్రహావేశాలకు లోనై సంభాషణలు చెబుతూ ఆకట్టుకున్నాడు. నటనలో వన్నె తెచ్చే హావభావాలు, డైలాగ్‌ డెలివరీ బాగుందని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. గతంలో లండన్‌లో జరిగిన తన ఫస్ట్‌ స్టేజ్‌ థియేటర్‌ పెర్ఫార్మెన్స్‌ ద్వారా కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

తండ్రి బాటలోనే గౌతమ్‌ – నటనలో కెరీర్‌ దిశగా

గౌతమ్‌ చిన్నతనంలోనే నటుడిగా తెరంగేట్రం చేశాడు. మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘1 నేనొక్కడినే’ చిత్రంలో చిన్నప్పటి మహేశ్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు యాక్టింగ్‌లో మరింత మెరుగుపడి, తన తండ్రి బాటలోనే నటనలో మంచి స్థానం సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. మరోవైపు మహేశ్ కుమార్తె సితార కూడా వాణిజ్య ప్రకటనలతో బిజీగా ఉంది. నగల బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించిన ఆమె, తాజాగా తన తండ్రితో కలిసి దుస్తుల బ్రాండ్‌ కమర్షియల్‌లో నటించింది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *