బుస్ బాబుతో.. మందు బాటు!! పాముని మెడలో వేసుకుని బీర్ తాగుతూ హాల్ చల్!!

తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో సూర్య అనే యువకుడు తన వింత చేష్టలతో కలకలం సృష్టించాడు. మెడలో పామును ఆభరణంలా వేసుకుని మద్యం దుకాణం వద్దకు వెళ్లిన సూర్య, అక్కడున్నవారిని భయాందోళనకు గురిచేశాడు. బీర్ బాటిల్ కొనుగోలు చేసి, ఆశ్చర్యకరంగా పాముకు తాగించి, దానికి ముద్దు పెట్టాడు. అంతటితో ఆగకుండా, రోడ్డు మధ్యలోకి వెళ్లి వాహనాలను ఆపుతూ హంగామా చేశాడు. ఈ ఘటన స్థానికులను షాక్‌లో ముంచెత్తింది.

మెడలో పాముతో బీర్ పార్టీ, రోడ్డుపై వాహనాలు ఆపి సూర్య రచ్చ చేశాడు!

సూర్య చేష్టలు చూసిన పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. కొందరు ఈ ఘటనను ఫన్నీగా భావిస్తే, మరికొందరు సూర్య తాగుబోతు చేష్టలను తప్పుబట్టారు. పాముకు మద్యం తాగించడం జంతు సంరక్షణ చట్టాలకు విరుద్ధమని, అలాగే రోడ్డుపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం చట్టవిరుద్ధమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించినట్లు సమాచారం. సూర్య ఈ చేష్టలకు పాల్పడిన కారణం, అతడు ఉపయోగించిన పాము రకం గురించి ఇంకా స్పష్టత లేదు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *