సైయాటికా నొప్పితో బాధపడేవారికి ఉపయోగపడే వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అందులో మూడు సులువైన స్ట్రెచ్‌లను చూపించారు. అవి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
మహిళల ఫిట్‌నెస్‌కు సంబంధించిన టిప్స్ వీడియో ఒకటి వైరల్ అవుతుంది. దాంట్లో రకాల స్ట్రెచ్ లను ట్రెయినర్ సూచిస్తోంది. మొదటిది: మోకాలిని ఎదురుగా ఉన్న భుజానికి తాకించడం. రెండోది: “ప్రెట్జెల్” స్టైల్లో కాళ్లను క్రాస్ చేసి మోకాలను ఛాతీకి లాగడం. మూడోది: ఫార్వర్డ్ పిజన్ పోజ్‌లో మోకాలిని ముందుకు చాచి టార్సోను కిందికి తీసుకురావడం. పడుకుని చేసే ఈ స్ట్రెచ్‌లు పడుకునే ముందు చేస్తే మంచి ఫలితం ఉంటుందని సూచించారు. “క్విక్ సైయాటికా రిలీఫ్!” అనే క్యాప్షన్‌తో వీడియోని పోస్ట్ చేశారు. ఈ వీడియోకు లక్షల వ్యూస్, వేల లైకులు వచ్చాయి. చాలామంది ఈ టిప్స్ తమకు చాలా ఉపయోగపడతాయని బుక్‌మార్క్ చేసుకున్నారు.





