సంగీత దర్శకుడు ఎస్. తమన్ తన క్రియేటివిటీతో మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించారు. పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘దే కాల్ హిమ్ ఓజీ’ సినిమా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (బీజీఎం) కోసం ఆయన ఒక ప్రత్యేకమైన ప్రయోగం చేశారు. జపనీస్ ఇన్‌స్ట్రుమెంట్ ‘కోటో’ ను వయోలిన్ బోతో వాయించి, ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో స్టూడియోలో వయోలిన్ బో సహాయంతో తీగలను మీటుతూ ఒక కొత్త ట్యూన్ ని ప్లే చేశాడు. ప్రయోగంతో వచ్చిన సౌండ్ చాలా అద్భుతంగా ఉందని తమన్ తెలిపారు. ఈ వీడియోను తమన్ తన అధికారిక అకౌంట్ నుంచి “#OgBgm This instrument is called Japanese (koto) Just tried With A violin Bow 🖤 Sounded this way 🤪🤯” అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే 7 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 21 వేలకు పైగా లైకులు, 4 వేలకు పైగా రీపోస్టులు వచ్చాయి. ఈ ప్రయోగం చూసిన అభిమానులు ‘ఓజీ’ సినిమా బీజీఎమ్ మీద అంచనాలు పెంచేసుకున్నారు.
సోషల్ మీడియాలో అభిమానుల కామెంట్లు
తమ అభిమాన హీరో సినిమా కోసం తమన్ చేస్తున్న వినూత్న ప్రయోగాలను చూసి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. “కుత కుత మంట రేగిపోవాలి” అంటూ కామెంట్లతో తమ ఆశను తెలియజేశారు. తమన్ ఇలాంటి కొత్త ప్రయోగాలు చేయడం వల్ల సినిమా మ్యూజిక్ మరింత ప్రత్యేకంగా ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.





