- అమెరికాలోని ఫ్లోరిడా జాతీయ రహదారిపై హఠాత్తుగా ఓ చిన్న విమానం అత్యవసరంగా నేలపై వాలిపోయింది.
- వేగాన్ని అదుపు చేయలేక ఆ విమానం ముందున్న కారును వెనక నుంచి ఢీకొంది. కారులో ఉన్న మహిళ సురక్షితంగా బయటపడింది.
రోడ్డుపై ల్యాండింగ్: ఏం జరిగింది?
అమెరికాలోని ఫ్లోరిడాలో వింతైన ప్రమాదం జరిగింది. రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఓ చిన్న విమానం వెనక నుంచి ఢీకొంది. సోమవారం రాత్రి బ్రెవర్డ్ కౌంటీ వద్ద ఇంటర్‌స్టేట్-95 జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. హఠాత్తుగా ఈ చిన్న విమానం నేలపై వాలిపోయింది. ఈ క్రమంలో అది వేగాన్ని అదుపు చేసుకోలేక ఎదురుగా ప్రయాణిస్తున్న కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఆమె ప్రాణాపాయం లేకుండా బయటపడింది.
ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో పైలట్, ఒక ప్రయాణికుడు ఉన్నారు. అగ్నిమాపక శాఖ అధికారులు వీరిద్దరూ సురక్షితంగా బయటపడినట్లు వెల్లడించారు. ఈ చిన్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. సాధారణంగా ఇలాంటి విమానాలు చిన్నపాటి సాంకేతిక లోపం వచ్చినప్పుడు, పైలట్లు సురక్షితమైన ప్రదేశంగా భావించి రహదారులపై ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తారు.





