సూరత్ టెక్స్‌టైల్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం! భవనం నిండా మంటలు!

Surat Textile Market Fire
  • గుజరాత్‌లోని సూరత్‌లో బహుళ అంతస్తుల టెక్స్‌టైల్ మార్కెట్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
  • భవనంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడానికి భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి.

గుజరాత్‌లోని సూరత్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సూరత్‌లోని బహుళ అంతస్తుల టెక్స్‌టైల్ మార్కెట్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ టెక్స్‌టైల్ మార్కెట్ భవనం నిండా మంటలు ఎగిసిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అయితే, టెక్స్‌టైల్ మార్కెట్ కావడంతో బట్టలు ఎక్కువగా ఉండి, మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి.

ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడానికి భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. టెక్స్‌టైల్ మార్కెట్‌లోని పలు దుకాణాలు ఈ అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. ఆస్తి నష్టం ఎంత జరిగింది, అలాగే ప్రాణ నష్టం వివరాలు ఏమైనా ఉన్నాయా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *