- వాట్సాప్ హాలిడే సీజన్ కోసం ‘మిస్డ్ కాల్ మెసేజెస్’ సహా అనేక కొత్త ఫీచర్లను విడుదల చేసింది
- ఎవరైనా కాల్కి స్పందించకపోతే, ఇకపై వెంటనే వాయిస్ లేదా వీడియో నోట్‌ను వదిలిపెట్టే అవకాశం ఉంది
- చాటింగ్‌ను మరింత క్రియేటివ్‌గా మార్చేందుకు Meta AI ఇమేజ్ క్రియేషన్ టూల్స్
కొత్త ఏడాదికి ముందు వాట్సాప్ (WhatsApp New Features 2025) మరో కీలక Update ను విడుదల చేసింది. ఈసారి హాలిడే సీజన్ చాటింగ్‌ను మరింత సరదాగా, సులభంగా నిర్వహించేందుకు అనేక కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో ముఖ్యమైనది ‘మిస్డ్ కాల్ మెసేజెస్’ ఫీచర్. హాలిడే కాలంలో బిజీగా ఉండే సందర్భాల్లో మిస్ అయ్యే కాల్స్ కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎవరైనా మీ కాల్కి స్పందించకపోతే, ఇకపై మీరు వెంటనే ఒక చిన్న వాయిస్ లేదా వీడియో నోట్‌ను ఒక్క ట్యాప్‌తో వదిలి పెట్టే అవకాశం ఉంది. ఇది ఆధునిక వాయిస్మెయిల్లా పనిచేస్తుంది. వారు సమయం దొరికినప్పుడు మీ సందేశాన్ని వినవచ్చు లేదా చూడవచ్చు.
గ్రూప్ చాట్‌లో ఇకపై Emoji రియాక్షన్లు!
గ్రూప్ వాయిస్ చాట్లను కూడా వాట్సాప్ మరింత మెరుగుపరుస్తోంది. ప్రతి ఒక్కరి ఫోన్ మోగకుండా మాట్లాడే వీలున్న ఈ ఫీచర్లో ఇప్పుడు రీయాక్షన్లు కూడా జోడించారు. మాట్లాడకుండా, చాట్‌ను డిస్టర్బ్ చేయకుండా, ఒక చిన్న Emoji తో స్పందించడానికి ఇది సహాయపడుతుంది. ఉదాహరణకు, “చియర్స్” లాంటి ఎమోజీని వెంటనే పంపేయచ్చు. వీడియో కాల్స్ విషయంలో, స్క్రీన్‌పై ఎవరు మాట్లాడుతున్నారో స్పష్టంగా చూపేందుకు స్పీకర్ స్పాట్లైట్ను కూడా జోడించింది.
ఫోటోను Video గా మార్చే AI ఆప్షన్
చాట్ అనుభవాన్ని మరింత క్రియేటివ్‌గా మార్చేందుకు వాట్సాప్ Meta AI ఇమేజ్ క్రియేషన్‌ను కూడా అప్‌గ్రేడ్ చేసింది. Midjourney, Flux నుండి వచ్చిన శక్తివంతమైన కొత్త మోడళ్ల వల్ల ఇప్పుడు యూజర్లు మరింత సహజంగా, మెరుగైన క్వాలిటీతో ఉన్న AI చిత్రాలను సృష్టించగలరు. ఇవి హాలిడే Greetings కు లేదా క్రియేటివ్ విజువల్స్‌కు మరింత పనికివస్తాయి. ఇంకా, ఏ ఫోటోనైనా చిన్న Video గా మార్చే కొత్త ఆప్షన్‌ను కూడా యాప్ అందిస్తోంది. ఇది మీ చాట్స్ లేదా Status కు ఫెస్టివ్ టచ్‌ను ఇస్తుంది. ఈ కొత్త Update లు అన్నీ యూజర్‌కు మరింత సౌలభ్యాన్ని ఇస్తాయని నిపుణులు అంటున్నారు.






