Ustaad Bhagat Singh Song: 24 గంటల్లో 29.6 Million Views! Ram Charan Record బ్రేక్!

Pawan Kalyan dancing vigorously in the 'Dekh Lenge Saala' song from Ustaad Bhagat Singh
  • పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్‌, హరీష్‌ శంకర్‌ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustaad Bhagat Singh Song Record) సినిమాలోని “దేఖ్‌ లేంగే సాలా (Dekh Lenge Saala)” పాట సంచలనం
  • 24 గంటల్లోనే 29.6 మిలియన్లకు పైగా Views సాధించి, రామ్ చరణ్ సినిమాలోని “చికిరి” పాట రికార్డును బద్దలు కొట్టింది.

‘గబ్బర్‌ సింగ్‌’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్‌ కళ్యాణ్‌ – హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం **’ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’**పై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా విడుదలైన “దేఖ్‌ లేంగే సాలా” Song ఈ అంచనాలను మరింత పెంచింది. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ పాట విడుదలైన కేవలం 24 గంటల్లోనే ఏకంగా 29.6 మిలియన్లకు పైగా Views సాధించి రికార్డు సృష్టించింది.

24 గంటల్లో ఈ స్థాయిలో Views అందుకున్న పాటగా “దేఖ్‌ లేంగే సాలా” కొత్త Record ను నెలకొల్పింది. ఇంతకుముందు ఈ Record రామ్‌ చరణ్‌ సినిమా ‘పెద్ది’లోని “చికిరి” Song పేరిట ఉండగా, ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసి Top లో నిలిచింది. ఈ సాంగ్ ఇంత పెద్ద Hit కావడానికి ప్రధాన కారణం పవన్‌ కళ్యాణ్‌ Dance అని చెప్పాలి. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ అదిరిపోయే Steps తో అభిమానులను Fida చేశాడు.

అంచనాలు మరింత పెరిగాయ్

ఈ Hit క్రెడిట్‌ పూర్తిగా దర్శకుడు హరీష్‌ శంకర్‌కే దక్కుతుందని అభిమానులు ప్రశంసిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన నుంచి ఏం కోరుకుంటున్నారో ఖచ్చితంగా అర్థం చేసుకుని, పక్కా Planning తో ఈ పాటను తెరకెక్కించాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే హరీష్‌ శంకర్‌పై ఫ్యాన్స్‌ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఒక్క పాటతోనే ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

సినిమా కూడా ఈ పాటలాగే భారీ విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని మేకర్స్‌ వ్యక్తం చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం 2026 ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. Song తోనే ఈ స్థాయి Records సృష్టించిన పవన్ కళ్యాణ్, సినిమాతో ఇంకెంత పెద్ద Records నెలకొల్పుతాడో చూడాల్సిందే.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *